Alleti Maheshwar Reddy: హైదర్‌గూడ MLA క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. HCU భూముల పరిశీలనకు బయల్దేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ వాగ్వాదానికి దిగారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమను అడ్డుకోవడం సరికాదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి.
ప్రజా పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేస్తుందని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి విమర్శించారు. జీవ వైవిద్యాన్ని దెబ్బతీసి కాంక్రీట్ జంగల్‌గా మార్చే ప్రయత్నాన్ని ఆపాలని డిమాండ్ చేశారు.
హెచ్‌సియు(HCU) లో జరుగుతున్న పరిణామాలు సరైనవి కావని, పక్షులకు నిలయాలుగా మారిన స్థలాన్ని JCB లతో చదును చేయడం సరికాదన్నారు. HCU పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు స్పందించి సీఎం రేవంత్ కు వివరించాలని సూచించారు.
HCU విద్యార్థులపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు సరికాదని, వారికి మద్దతు తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేసి అడ్డుకోవడం దారుణమన్నారు. కంచె గచ్చిబౌలి HCUలో భూముల పరిశీలనకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం వెళ్లనుండగా రామచంద్రాపురంలో అంజిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
కాగా.. ప్రస్తుతం తెలంగాణలో గచ్చిబౌలి భూముల చుట్టూ పెద్ద దుమారమే రేగుతోంది. 400 ఎకరాలను ఇటీవలే సుప్రీం కోర్టు కేసు ద్వారా స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం TGIIC ఆధ్వర్యంలో ఆ ప్రాంతాన్ని పారిశ్రామిక అవసరాల కోసం వాడేందుకు డెవలప్ చేస్తోంది. అయితే ఆ భూమిని టచ్ చేయొద్దు అని HCU స్టూడెంట్స్, అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ ఇలా అంతా రంగంలోకి దిగే సరికి రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ విషయంపై ఇటీవలే సీఎం రేవంత్ కూడా ఫైర్ అయ్యారు.
అది గ్రీన్ జోన్ అని, నెమళ్ల స్థావరం అని రకరకాల పేర్లు పెట్టి ప్రభుత్వం తీసుకునేందుకు వీల్లేదన్న వాదనను విపక్షాలు తెరపైకి తెచ్చాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25 లోని 400 ఎకరాల భూమి చుట్టూ వివాదం పెరిగే సరికి TGIIC క్లారిఫికేషన్ ఇచ్చింది. డెవలప్ మెంట్ చేస్తున్న 400 ఎకరాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూములు లేవన్నది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల కిత్రం కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుందని, అభివృద్ధి పనులతో అక్కడ ఉన్న రాళ్లకు నష్టం లేదని, అంతే కాదు.. 400 ఎకరాల్లో చెరువు కూడా లేదన్నది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ సమ్మతితోనే 2024, జులై 19న HCU రిజిస్ట్రార్, యూనివర్సిటీ ఇంజినీర్, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రెవెన్యూ అధికారులు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, మండల సర్వేయర్ సమక్షంలో సర్వే జరిగిందని, అదే రోజు హద్దులు నిర్ధారించారన్నది TGIIC.
మరోవైపు సీన్ లోకి HCU స్టూడెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. గ్రీన్ జోన్ ను డిస్టర్బ్ చేయొద్దన్నారు. అభివృద్ధి పనులకు అడ్డం పడ్డారు. అవి కూడా ప్రభుత్వ భూములే అన్నారు. అసలు సర్వేనే జరగలేదని, తాము అంగీకరించలేదని HCU స్టూడెంట్స్ అంటున్నారు. అటు ఈ భూములు అమ్మొద్దంటూ బీజేపీ, బీఆర్ఎస్ కూడా రంగంలోకి దిగాయి. బీజేపీ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమంటోంది. ప్రకృతికి, విద్యార్థులను నష్టం చేసి భూమి అమ్ముతారా అని ప్రశ్నిస్తున్నారు.
Also Read: సన్న బియ్యం పంపిణీ.. ఒక్కొక్కరికి ఎన్ని కిలోలంటే..?
హైదరాబాద్ నగరానికి ఆయువుపట్టు, ఊపిరి లాంటి ప్రాంతమైన గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని విక్రయించాలని అనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ తెలివి తక్కువ నిర్ణయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే కేటీఆర్ కూడా ఫైర్ అవుతున్నారు. HCU క్యాంపస్ లో 700 రకాల పుష్పించే మొక్కలు, 10 రకాల క్షీరదాలు, 15 రకాల సరీసృపాలు, 200 జాతులకు చెందిన పక్షులకు నిలయంగా ఉందంటున్నారు. సహజ సిద్ధ ప్రాంతాన్ని నాశనం చేసే విధ్వంసాన్ని ఆపాలన్నారు. అయితే బీఆర్ఎస్ హయాంలో వేలం వేసి అమ్మిన భూముల సంగతేంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆదాయం కోసం భూముల వేలాన్నే నమ్ముకున్నది నిజం కాదా అని క్వశ్చన్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కంచె గచ్చిబౌలి భూములపై కీలక పత్రాలు బయటపెట్టింది ప్రభుత్వం. కంచె గచ్చిబౌలి భూములతో HCUకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు విడుదల చేసింది. చంద్రబాబు హయాంలోనే HCU నుంచి భూములు తీసుకున్న పంచనామా రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. ఆ భూములకు బదులుగా గోపన్‌పల్లిలో HCUకు భూమిని కేటాయించింది. ఇందుకు సంబంధించిన పంచనామా రిపోర్ట్ కూడా విడుదల