BigTV English

Telangana Group -2: గ్రూప్ -2 పరీక్షల షెడ్యూల్ విడుదల

Telangana Group -2: గ్రూప్ -2 పరీక్షల షెడ్యూల్ విడుదల

Telangana Group -2 : టీజీపీఎస్సీ గ్రూప్ -2 పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో గ్రూప్ -2 పరీక్షలను నిర్వహించున్నారు.


తెలంగాణ గ్రూప్-2 పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలను నిర్వహించున్నట్లు టీజీపీఎస్సీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లోనే జరగాల్సి ఉంది. కానీ ఆ తేదీల్లో డీఎస్సీ , గ్రూప్ -2 పరీక్షలకు మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ఈ పరీక్షలు డిసెంబర్ కు వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. దీంతో గ్రూప్ -2 పరీక్షలను డిసెంబర్ కు రీషెడ్యూల్ చేస్తున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. తాజాగా పరీక్షల షెడ్యూల్ కూడా ప్రకటించింది. మొతం 783 గ్రూప్-2 పోస్టులకు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

Also Read: గ్రామ పంచాయతీ ఎన్నికల తాజా అప్డేట్.. షెడ్యూల్ విడుదల


తాజా గ్రూప్ -2 పరీక్షల షెడ్యూల్ ప్రకారం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంట నుంచి 12.30 గంటల వరకు ఒక సెషన్ , మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండవ సెషన్ లో పరీక్షలు జరుగుతాయని టీజీపీఎస్సీ కార్యదర్శి డా. నవీన్ నికోలస్ వెల్లడించారు. ఈ పరీక్షలు ప్రారంభానికి వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×