E-Paper
Advertisement

TGICCC: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. టీజీఐసీసీసీలో కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల కీలక భేటీ

TGICCC: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. టీజీఐసీసీసీలో కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల కీలక భేటీ
Advertisement

TGICCC: సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తు మహమ్మారిని వేళ్లతో సహా ఏరిపారేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ)లో కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), ఎక్సైజ్ శాఖ, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఈగల్, ఎఫ్ఆర్ఆర్‌ఓ (FRRO) వంటి కీలక విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు అన్ని విభాగాలు ఒకే తాటిపైకి వచ్చి పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లపై పోలీసులు ఏ విధమైన నిఘాను ఉంచుతారో, అదే స్థాయిలో డ్రగ్స్ నేరగాళ్లు, పెడ్లర్లపైనా గట్టి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) ను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

నగరంలో ప్రస్తుతం పనిచేస్తున్న హెచ్-న్యూ బృందాలకు తోడుగా, అదనంగా మరో నాలుగైదు కొత్త బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు చేపడుతూ, సరఫరా గొలుసును దెబ్బతీసేలా పనిచేస్తాయి. మాదకద్రవ్యాల నిర్మూలన అనేది కేవలం ఒక్కరోజుతో ముగిసే ప్రక్రియ కాదని, ఇది సమాజం కోసం సాగించే నిరంతర పోరాటమని సమావేశం స్పష్టం చేసింది. ఈ పోరాటంలో అత్యాధునిక సాంకేతికతను (Advanced Technology) వినియోగించి నేరస్థుల కదలికలను పసిగట్టనున్నట్లు పేర్కొన్నారు.

అన్ని ఏజెన్సీల మధ్య సమన్వయం లోపించకుండా ఉండేందుకు, ఇకపై ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇటువంటి సమీక్షా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో పాత కేసుల పురోగతిని సమీక్షించడంతో పాటు, కొత్తగా వస్తున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చర్చించనున్నారు. దేశ సరిహద్దుల నుండి నగర గల్లీల వరకు డ్రగ్స్ రవాణా కాకుండా పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేయడమే ఈ సమన్వయ కమిటీ ప్రధాన ఉద్దేశం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, డ్రగ్స్ వినియోగం లేదా సరఫరా గురించి సమాచారం అందించి ఈ మహోద్యమంలో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.

Advertisement

ALSO READ: Panchayat Elections: ఒక్క ఓటే కదా అనుకుంటాం.. కానీ ఆ సింగిల్ ఓటే ఎంత పని చేసింది భయ్యా.. వీళ్లు ఎలా గెలిచారో చూడండి..

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×