E-Paper
Advertisement

Pawan Kalyan: గంటల వ్యవధిలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్

Pawan Kalyan: గంటల వ్యవధిలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్
Advertisement

టీ20 ప్రపంచకప్‌ను సాధించిన భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తమ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచకప్ సాధించడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, తమ విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించడం జట్టుకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి (డిప్యూటీ సీఎం) పవన్ కళ్యాణ్ తమ జట్టు సభ్యులందరికీ అండగా నిలబడి, ఆర్థిక చేయూత అందించారని దీపిక తెలిపారు. తమ జట్టుకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పిస్తే భవిష్యత్తులో భారత జట్టుకు మరిన్ని అంతర్జాతీయ విజయాలు అందిస్తామని దీపిక విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

ఈ విజయవంతమైన జట్టులో అల్లూరి జిల్లాకు చెందిన యువ క్రీడాకారిణి పాంగి కరుణ కుమారి కూడా సభ్యురాలుగా ఉన్నారు. అల్లూరి జిల్లాలోని వంట్లమామిడి గ్రామానికి చెందిన కరుణ కుమారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. జట్టు విజయం సాధించిన వెంటనే.. కెప్టెన్ దీపికతో పాటు కరుణ కుమారికి మరియు జట్టు సభ్యులందరికీ ఆయన ఆర్థిక చేయూత అందించారు.

పాడేరు మండలానికి చెందిన అంధ క్రికెటర్ కరుణ కుమారికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐదు లక్షల రూపాయల నగదు కూడా అందజేశారు. దీనికి కొనసాగింపుగా.. ఆదివారం రోజున కరుణ కుమారి కుటుంబానికి కావాల్సిన సహాయాన్ని అందించాలని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు.. కేవలం 24 గంటల్లోనే జనసేన నాయకులు కరుణ కుమారి ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు, ఇతర పరికరాలను అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Advertisement

ప్రపంచకప్ విజేత క్రీడాకారిణిని స్వయంగా అభినందించి.. ఆమెకు, ఆమె కుటుంబానికి అండగా నిలబడటం పట్ల పవన్ కళ్యాణ్ చేసిన ఈ సహాయం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. దేశానికి గర్వకారణంగా నిలిచిన క్రీడాకారులకు ప్రభుత్వ మరియు ప్రముఖుల మద్దతు ఇలాగే కొనసాగాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×