BigTV English

TG High Court : ఆ అధికారం మాకు లేదని స్పష్టం చేసిన హైకోర్టు.. బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ

TG High Court : ఆ అధికారం మాకు లేదని స్పష్టం చేసిన హైకోర్టు.. బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ

TG High Court : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. పార్టీ మారిన ప్రజాప్రతినిధులపై ఎలాంటి చర్యలు చేపట్టేందుకైనా స్పీకర్ దే తుది నిర్ణయమని వెల్లడించింది. దాంతో.. ఈ కేసు వ్యవహారం తిరిగి తిరిగి అసెంబ్లీ స్పీకర్ దగ్గరకే వచ్చి చేరినట్లైంది. కాగా.. తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెబుతున్న బీఆర్ఎస్ నేతలకు.. ఈ తీర్పు గట్టి షాక్ ఇచ్చినట్లైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


గతేడాది నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ లు.. ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఈ చర్యను తప్పుపట్టిన బీఆర్ఎస్ పార్టీ.. వాళ్లు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని, వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను కోరారు. ఈ అభ్యర్థన స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉండగానే.. త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందలు హైకోర్టును ఆశ్రయించారు. వీరితో పాటు దానం నాగేంద్ర పార్టీ ఫిరాయించారని, అతనిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశర్వర్ రెడ్డి సైతం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్.. నెల రోజుల క్రితం తీర్పు వెలువరించింది. అనర్హన కోరుతూ చేసిన అభ్యర్థనలు ఇంకా తన ముందుకు రాలేదని స్పీకర్ తెలపడంతో.. పార్టీలు మారిన ప్రజాప్రతినిధులకు సంబంధించిన దస్త్రాలను స్పీకర్ ముందుంచాలని సూచిస్తూ అసెంబ్లీ కారదర్శికి హైకోర్టు అదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాళు చేస్తూ అసెంబ్లీ కారదర్శి హైకోర్టను తిరిగి ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ తాజాగా తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.


అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి తుది నిర్ణయాధికారం స్పీకర్ దే నని స్పష్టం చేసింది. అయితే.. పార్టీ ఫిరాయింపుల నిరోధఖ చట్టం, షెడ్యూల్ 10 ప్రకారం చర్యలు చేపట్టాలని సూచించింది. ఐదేళ్ల గడువున్న నేపథ్యంలో స్పీకర్ నిర్ణయాల్ని నిర్దేశించలేమని తేల్చి చెప్పింది. తాజా తీర్పుతో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య అధికార విభజన ఉంటుందని, ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ జోక్యం చేసుకోవడం కుదరదని స్పష్టం చేసినట్లైంది.

Also Read : లగచర్ల కేసులో సంచలనం.. దాడిలో కేసీఆర్ కుట్రపై కోర్టుకు సాక్ష్యాలు..

వాస్తవానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ లోకి ఇతర పార్టీ నేతల చేరికల్ని భారీగా ప్రోత్సహించారు. గ్రామ, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు అందరికీ.. గులాబీ కండువాలు కప్పారు. అప్పుడు… ఇదేంటని అడిగిన వారికి రాజకీయ పునరేకీకరణ అంటూ సరికొత్త నిర్వచనం ఇచ్చారు కేసీఆర్. ఇప్పుడు.. సరిగా అలాంటి పరిస్థితే తన పార్టీకి ఎదురుకావడంతో.. దిక్కుతోచని స్థితిలో కోర్టులను ఆశ్రయిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×