BigTV English
Advertisement

Most Expensive Passport: ప్రపంచంలో ఖరీదైన పాస్‌పోర్ట్ ఈ దేశానిదే.. ఇండియా కన్నా చీప్‌గా మరో దేశంలో..

Most Expensive Passport: ప్రపంచంలో ఖరీదైన పాస్‌పోర్ట్ ఈ దేశానిదే.. ఇండియా కన్నా చీప్‌గా మరో దేశంలో..

Most Expensive Passport| ప్రపంచంలో అంతర్జాతీయ ప్రయాణాలు చేసేందుకు అవసరమైన పత్రాలలో పాస్‌పోర్ట్ అతిముఖ్యమైనది. ఇది ప్రయాణికుడి దేశ పౌరసత్వానికి గుర్తింపు. ఏ దేశంలోనైనా పౌరులు పాస్‌పోర్ట్ పొందాలంటే అక్కడి ప్రభుత్వాలు చెప్పే ప్రక్రియను పాటించాలి. పాస్ పోర్ట్ పొందడానికి ముందుగా దరఖాస్తు చేసుకొని కొంత ఫీజు చెల్లించాలి. పాస్‌పోర్ట్ గడువుపై దాని ఫీజు ఆధారపడి ఉంటుంది. ఈ పాస్‌పోర్ట్ ఫీజు కొన్ని దేశాలలో చాలా ఎక్కువగా ఉంటే.. మరి కొన్ని దేశాలలో నామమాత్రంగానే ఉంది. ఏ దేశంలో పాస్ట్ పోర్ట్ ఫీజు ఎంత? అనే జాబితా వివరాలను తాజాగా హెన్లే పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024లో ప్రచురితమయ్యాయి.


హెన్లే పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024లో తెలిపిన వివరాల ప్రకారం.. ఒక దేశంలో అత్యధికంగా పాస్‌పోర్ట్ పొందడానికి రూ.19000కు పైగా ఫీజు చెల్లించాల్సి ఉండగా.. ఇండియా లాంటి దేశాల్లో కేవలం రూ.1500 మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ జాబితాలో అత్యంత ఖరీదైన పాస్‌పోర్ట్ మెక్సికో దేశం అందిస్తోంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన టాప్ 10 పాస్‌పోర్ట్ లలో మూడు పాస్‌పోర్ట్‌లు మెక్సికో దేశానికి చెందినమే కావడం విశేషం. మెక్సికోలో 10 సంవత్సరాలు గడువు ఉన్న ఒక పాస్‌పోర్ట్ ఫీజు రూ.19,481 అయితే 6 సంవత్సరాల గడువు ఉన్న పాస్‌పోర్ట్ పొందడానికి రూ.11,115 ఖర్చు అవుతుంది. టాప్ 10 ఖరీదైన పాస్‌పోర్ట్ జాబితాలో మెక్సికో మూడేళ్ల పాస్‌పోర్ట్ 9వ స్థానంలో ఉంది.

మెక్సికో తరువాత అస్ట్రేలియా పాస్‌పోర్ట్ ఖరీదైన పాస్‌పోర్ట్ జాబితాలో రెండో స్థానంలో ఉంది. అస్ట్రేలియాలో 10 ఏళ్ల గడువు ఉన్న పాస్‌పోర్ట్ ఫీజు కోసం రూ.19,023 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత మూడో స్థానంలో అమెరికా 10 ఏళ్ల పాస్‌పోర్ట్ ఫీజు రూ.13,899 ఉంది. ఈ జాబితాలో న్యూజిల్యాండ్ పాస్‌పోర్ట్ 5వ స్థానంలో ఉంది. 10 ఏళ్ల గడువు గల న్యూజిల్యాండ్ పాస్‌పోర్ట్ ఫీజు రూ.10,654 గాఉంది.


Also Read: 10 మంది పిల్లల తండ్రితో ప్రేమవివాహం.. ప్రాణహాని ఉందని కోర్టుకెళితే జడ్జి ఫైర్

ఇక అత్యంత తక్కువ ఫీజు గల పాస్‌పోర్ట్ విషయానికి వస్తే.. టాప్ చీపెస్ట్ పాస్‌పోర్ట్ ల జాబితాలో యుఎఇ 5 ఏళ్ల పాస్‌పోర్ట్ ఉంది. దీని ఫీజు రూ.1492 మాత్రమే. భారతదేశంలో 10 ఏళ్ల గడువు గల పాస్‌పోర్ట్ ఫీజు రూ.1523 ఉంది. అత్యంత అక్కువ ఖర్చుతో పొందే పాస్‌పోర్ట్‌ల జాబితాలో హంగేరి, స్పెయిన్, కెన్యా, దక్షిణ ఆఫ్రికా దేశాలున్నాయి.

అయితే ఎక్కువ కాలం గడువు, తక్కువ ఫీజు ఉండడం వల్ల ఇండియా పాస్‌పోర్ట్ కు మంచి ర్యాంక్ లభించింది. ముఖ్యంగా ఇండియా పాస్‌పోర్ట్ ఉన్నవారు.. 58 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. హెన్లే పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024 జాబితాలో ఇండియన్ పాస్‌పోర్ట్‌కు 82వ స్థానం లభించింది.

టాప్ 5 ఖరీదైన పాస్‌పోర్ట్‌ల జాబితా
మెక్సికో (10 ఏళ్ల పాస్‌పోర్ట్) – రూ. 19,481.75
ఆస్ట్రేలియా (10 ఏళ్ల పాస్‌పోర్ట్) – రూ. 19,023
అమెరికా (10 ఏళ్ల పాస్‌పోర్ట్) – రూ. 13,899
మెక్సికో (6 ఏళ్ల పాస్‌పోర్ట్) – రూ. 11,115
న్యూజిల్యాండ్ (10 ఏళ్ల పాస్‌పోర్ట్) – రూ. 10,654

టాప్ 5 తక్కువ ఖర్చు పాస్‌పోర్ట్‌ల జాబితా
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఈ) (5 ఏళ్ల పాస్‌పోర్ట్) – రూ.1492
ఇండియా (10 ఏళ్ల పాస్‌పోర్ట్) – రూ. 1,523
హంగేరి (5 ఏళ్ల పాస్‌పోర్ట్) – రూ. 1,747
దక్షిణ ఆఫ్రికా (10 ఏళ్ల పాస్‌పోర్ట్) – రూ. 2,664
కెన్యా (10 ఏళ్ల పాస్‌పోర్ట్) – రూ. 2,710

Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×