Bosta – Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ వద్ద శుక్రవారం జరిగిన సంఘటనతో అందరూ ఆశ్చర్యకితులయ్యారు. ఒకరేమో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. మరొకరేమో వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ ఎదురెదురుగా కరచాలనం చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజకీయాలలో ఏదైనా సాధ్యమేనంటున్నారు వీరిద్దరి కరచాలనాన్ని దగ్గర నుండి చూసిన పార్టీల నాయకులు. అదే కారణమని కూడా గుసగుస లాడుకున్నారు.
ఏపీ అసెంబ్లీ వద్ద శుక్రవారం పీఎసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను టీడీపీ కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సభ్యులు అసెంబ్లీ వద్దకు రాగా, అసెంబ్లీ వద్ద సందడి సందడిగా మారింది.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నందుకు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అదే సమయానికి అసెంబ్లీ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ బయటకు వస్తుండగా, ఇక్కడే ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను చూసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుగా అక్కడ ఆగి ఉన్న క్రమంలో, బొత్స సత్యనారాయణ ఏకంగా వెళ్లి పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు చిరునవ్వులు చిందించి కొద్ది క్షణాలు మాట్లాడుకున్నారు.
అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు ఈ దృశ్యాన్ని చిత్రీకరించగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బొత్స ను పవన్ ఆప్యాయంగా పలకరించడం, అదే రీతిలో బొత్స కూడా పలకరించడంతో.. రాజకీయాలలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అంటూ అక్కడ నేతలు చర్చించుకున్నారు.
కూటమి వర్సెస్ వైసీపీ మధ్య శాసనమండలి వేదికగా వాడి వేడిగా చర్చలు సాగుతున్న నేపథ్యంలో, వీరి పలకరింపులు అక్కడి నేతలను ఆశ్చర్యపరిచాయి. ఇటీవల పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసనమండలిలో బిల్లును ప్రవేశపెట్టగా, బొత్స సత్యనారాయణ తమ మద్దతు ప్రకటించారు. అందుకే వీరి కరచాలనం అంటూ అక్కడ ప్రచారం సాగింది. కాగా రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగత ఆప్యాయతలు వేరుగా ఉంటాయన్న రీతిలో వీరి కరచాలనం వీడియో వైరల్ గా మారింది.
పవన్, బొత్స మధ్య ఆసక్తికర సన్నివేశం..
ఏపీ అసెంబ్లీలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పీఏసీ ఎన్నిక ఓటింగ్ వేళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణ అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఎదురుపడ్డారు. ఈ క్రమంలో పవన్ను బొత్స ఆప్యాయంగా పలకరించి కరచాలనం… pic.twitter.com/fjMuPKC2jy
— ChotaNews (@ChotaNewsTelugu) November 22, 2024