BigTV English

KCR In Lagacharla Case : లగచర్ల కేసులో సంచలనం.. దాడిలో కేసీఆర్ కుట్రపై కోర్టుకు సాక్ష్యాలు..

KCR In Lagacharla Case : లగచర్ల కేసులో సంచలనం.. దాడిలో కేసీఆర్ కుట్రపై కోర్టుకు సాక్ష్యాలు..

KCR In Lagacharla Case : ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో తవ్వేకొద్ది అనేక విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే..  స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి రాష్ట్ర పార్టీ కార్యనిర్వకర అధ్యక్షుడి వరకు అనేక మంది పేర్లు బయటకు వచ్చాయి. ఆయా విషయాలతోనే రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతుండగా.. ఇప్పుడు పెద్ద నాయకుడి పేరు ఈ కేసులో వినిపిస్తోంది. లగచర్ల ఘటనలో ఆయన పాత్ర కూడా ఉందంటూ.. ప్రభుత్వం లాయర్లు వెల్లడిస్తున్నారు. ఆ పెద్ద మనిషే.. కేసీఆర్. అవును.. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ సైతం ఈ కేసులో ఇన్వాల్ అయ్యారనే విషయాలు వెలుగుచూస్తున్నాయి.


ఫార్మాసిటి నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ అంశాన్ని ఆసరాగా చేసుకుని.. రాష్ట్ర స్థాయి నేతలు పెద్ద కుట్రలకే పాల్పడ్డారని పోలీసు విచారణలో వెల్లడవుతోంది. ఇప్పటికే.. ఈ దాడి వెనుక ప్రభుత్వాన్ని గద్దె దింపాలని, సర్కార్ ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశ్యం ఉన్నట్లు రిమాండ్ లోని నిందుతుల విచారణలో వెల్లడైంది. కాగా.. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ పెద్ద సారు సైతం తలదూర్చారంటే.. ఈ కుట్ర వెనుక ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయోననే చర్చ నడుస్తోంది.

కేటీఆర్ పేరును ఇప్పటికే బయటపెట్టిన.. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా కేటీఆర్ పేరును ప్రకటించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర సర్కార్.. ఏకంగా ప్రభుత్వ అధికారుల్నే టార్గెట్ గా చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. దాంతో.. కేసును మరింత లోతుగా పరిశీలిస్తుండగా.. ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.


తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, తన రిమాండ్ ను రద్దు చేయాలంటూ పట్నం నరేంద్ర రెడ్డి హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా జరిగిన వాదనల సమయంలో.. ప్రభుత్వం అసలు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. లగచర్ల దాడి కుట్రలో.. నిందితులతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్రర్ రెడ్డి నేరుగా సంప్రదింపులు జరిపారని తెలిపారు. ఆయన వెనుక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఉన్నట్లు ప్రభుత్వం తరఫున న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు.

Also Read : మహిళలకు రూ. 2,500, పెళ్లికి తులం బంగారం అప్పటి నుంచే.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ఈ దాడి కుట్రలో నిందితుల్ని రెచ్చగొట్టేందుకు కేసీఆర్ రూ.10 కోట్లు విడుదల చేశారని తెలిపారు. సురేష్ ద్వారా జిల్లా కలెక్టర్ ను హత్య చేసేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. ఇందుకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని కోర్టు ప్రశ్నించగా, పట్నం నరేంద్రర్ రెడ్డి, కీటీఆర్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలతో పాటు మాజీ ఎమ్మెల్యే నరేంద్రర్ రెడ్డి, ప్రధాన  నిందితుడు సురేష్ తో మాట్లాడిన కాల్ డేటా వంటి ఆధారాలను సమర్పించారు.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×