Big Stories

Lok Sabha elections 2024: తెలంగాణలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. రేపు పరిశీలన

Lok Sabha elections 2024 news(Telangana news today): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.ఈరోజు ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాలకు 547 మంది అభ్యర్థులు 856 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలు అయినట్టు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ ప్రక్రియ ముగియగా.. మొత్తం 17 స్థానాలకు గాను 600 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

- Advertisement -

కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా నామినేషన్ సమయం నేటితో ముగిసింది. కాగా, దీనికి 13కి పైగా నామినేషన్ల దాఖలు అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. దీనికి కూడా ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలు అయినట్టు సమాచారం. రేపు నామినేషన్ల పరిశీలన, ఈనెల 29వ తేదీన ఉపసంహరణకు గడువు ఉందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News