BigTV English

Telangana Group -2: గ్రూప్ -2 పరీక్ష వాయిదా

Telangana Group -2: గ్రూప్ -2 పరీక్ష వాయిదా
Advertisement

Telangana Group -2 Postpone update(Telangana news live):  తెలంగాణ గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఆగస్ట్ 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా పరీక్షలను వాయిదా వేసింది. డీఎస్సీ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌కు వాయిదా వేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ కారణంగా గ్రూప్- 2ను వాయిదా వేయాలని నిరుద్యోగుల ఆందోళన క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


గ్రూప్ -2 పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. గ్రూప్ -2 పరీక్ష వాయిదాతో పాటు పోస్టుల సంఖ్య పెంచాలని గత నెల రోజులుగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్ నగర్ , దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు పలు రకాలుగా నిరసనలు తెలిపారు. నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల అశోక్‌నగర్‌లో భారీ నిరసన చేపట్టిన అభ్యర్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ సచివాలయం ముట్టడికి కూడా పిలుపునిచ్చారు అభ్యర్థులు.

మొత్తం 783 పోస్టుల భర్తీకి గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం పరీక్ష వాయిదా పడటంతో పోస్టులు కూడా పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 2 వేల పోస్టులు అదనంగా పెంచాలని అంటున్నారు. నిరుద్యోగుల డిమాండ్ నేపథ్యంలో పోస్టులు పెంచుతారా లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


 

Related News

Telangana News: బీసీ రిజర్వేషన్ల అంశం.. ఎస్ఎల్‌పీ పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరణ, పాత పద్దతిలో ఎన్నికలు?

Telangana politics: మీనాక్షి నటరాజన్ దగ్గరకు కొండా సురేఖ..

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. నేతల మధ్య మాటల యుద్ధం, కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Supreme Court: సుప్రీంపై సర్కారు ఆశలు.. రిజర్వేషన్లపై రేవంత్ ప్రయత్నాలు ఫలిస్తాయా!

Hyderabad: 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్..

Konda Surekha: మా అమ్మనే అరెస్ట్ చేస్తారా..? రాత్రి కొండ సురేఖ ఇంటి వద్ద ఏం జరిగిందంటే..

Trolling On Ktr: మానవత్వం, కాకరకాయ.. కేటీఆర్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్

Hyderabad: మిస్టర్ టీ యజమాని నవీన్ రెడ్డి నగర బహిష్కరణ.. రాచకొండ పోలీసు కమిషనర్ నోటీస్ జారీ

Big Stories

×