BigTV English

Citroen Basalt: అంతా సిద్ధం.. టాటాతో పోటీకి దిగుతున్న సిట్రోయోన్!

Citroen Basalt: అంతా సిద్ధం.. టాటాతో పోటీకి దిగుతున్న సిట్రోయోన్!
Advertisement

Citroen Basalt: ఇప్పుడు మార్కెట్‌లో క్రాస్‌ఓవర్, కూపే కార్ల యుగం నడుస్తుంది. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా టాటా కర్వ్ జులై 10న విడుదల కానుండగా, సిట్రోయోన్ కొత్త కూపే బసాల్ట్ ఆగస్టు 2న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ రెండు కార్లు గురించి ఆటోమొబైల్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సెగ్మెంట్‌లు కొత్తవి కాకపోయానా ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్‌ని టార్గెట్ చేస్తున్నాయి. ఈ రెండు కార్లు భారతీయ కార్ మార్కెట్ చరిత్రని మార్చగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కస్టమర్లు కూడా కొత్త డిజైన్, టెక్నాలజీతో వచ్చే కార్లను కొనుగోలు చేయడానికి ఇష్డపడుతున్నారు.


నివేదికల ప్రకారం సిట్రోయెన్ కొత్త బసాల్ట్ కూపే ఆగష్టు 2న విడుదల కానుంది. కారు పొడవు 4.3 మీటర్లు ఉంటుంది. కొత్త బసాల్ట్ సి సెగ్మెంట్‌లో విడుదల కానుంది. దీని డిజైన్ ఫోర్ డోర్ కూపే ఆధారంగా ఉంటుంది. దీని సీట్లు మృదువుగా మంచి వెంటిలేషన్‌ అందిస్తాయి, ఇది రోజువారీ ఉపయోగంతో పాటు దూర ప్రయాణాలకు ప్రత్యేకంగా రూపొందించారు. వెనుక ప్రయాణీకులకు ఎక్కువ స్థలం ఉంటుంది.

Also Read: Best Second Hand Electric Scooter: ఈవీల హవా.. సెకండ్ హ్యాండ్ స్కూటర్లకు ఫుల్ డిమాండ్.. ఇలా కొనండి!


కొత్త బసాల్ట్ 1.2L 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. కొత్త ఇంజన్ అన్ని రకాల వాతావరణంలో మంచి పనితీరును ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఇంజన్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది.  త్వరలో ఈ కొత్త మోడల్ యొక్క EV వెర్షన్‌ను కూడా పరిచయం చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. డీజిల్ ఇంజన్‌లో కొత్త బసాల్ట్‌ను తీసుకొచ్చే అవకాశం ప్రస్తుతం అయితే లేదు.

కొత్త బసాల్ట్ డిజైన్ దాని అతిపెద్ద అప్‌డేట్‌గా చెప్పవచ్చు. దీని ఫ్రంట్ లుక్ చాలా బోల్డ్‌గా ఉండబోతోంది. ఇందులో కొన్ని మంచి కలర్స్ కనిపిస్తాయి. ఇది చూడటానికి స్పోర్టి లుక్ కలిగి ఉంటుంది. దీనికి డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. కొత్త బసాల్ట్ CMP ప్లాట్‌ఫామ్‌పై తయారవుతుంది. ఇందులో కంపెనీ ప్రస్తుత సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ ఫీచర్లను మాత్రమే తీసుకురావచ్చు.

కొత్త సిట్రోయెన్ బసాల్ట్ నేరుగా టాటా మోటార్స్ Curvv SUV కూపేతో పోటీపడుతుంది. టాటా కర్వ్‌ను జూలై 19న విడుదల చేయనున్నారు. Curvv 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ని పొందవచ్చు. ఇది 115 PS పవర్ రిలీజ్ చేస్తుంది. టెస్టింగ్ సమయంలో ఇది అనేక సార్లు కనపించింది. ఈ కారు అంచనా ధర రూ. 11-12 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Also Read: 2024 Suzuki Avenis Launched: సుజికి అవెనిస్ లాంచ్.. దీనిలో కొత్త ఫీచర్లు ఏమి ఉన్నాయో తెలుసా?

కంపెనీ తన EV వెర్షన్‌ను కూడా త్వరలో విడుదల చేయవచ్చు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టాటా కొత్త ఫ్లాగ్‌షిప్ Curvv Coupe SUV 55-60 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది ఫుల్ ఛార్జింగ్ పై 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ ఉంటుంది.

Related News

Amazon Diwali Offers: అమెజాన్ దీపావళి ఆఫర్లు.. 80% తగ్గింపు, రూ.80 క్యాష్‌బ్యాక్! బ్యూటీ ప్రోడక్ట్స్ పై భారీ తగ్గింపు

Hyderabad Postal: హైదరాబాద్ లో 24×7 స్పీడ్ పోస్ట్ బుకింగ్.. నైట్ షిఫ్ట్ ప్రారంభించిన పోస్టల్ శాఖ

BSNL Diwali Offer: బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా ఆఫర్.. రూ.1కే కొత్త కనెక్షన్.. ఉచిత సిమ్, రోజుకు 2 జీబీ డేటా

EPFO New Rules: PF ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ.. ఈ కొత్త నియమాలు మీకు తెలుసా?

Diwali Gold: రూ.41 వేలకే 10 గ్రాముల బంగారం కొనేయండి.. జస్ట్ ఇలా చేస్తే చాలు

LIC BIMA Lakshmi: తక్కువ ప్రీమియంతో ఎల్ఐసీ కొత్త పాలసీ.. బీమా లక్ష్మి ప్లాన్ వివరాలు ఇలా!

Digital Gold Investments: డిజిటల్ బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చా? లాభాలు ఏమిటీ?

JioMart Offer on Rice Bag: జియోమార్ట్ అదిరే ఆఫర్.. 26 కిలోల బియ్యం మరీ ఇంత తక్కువ ధరకా?

Big Stories

×