ఆదివారం తెల్లవారుజామున డీకే అరుణ ఇంట్లోకి చొరబడి దాదాపు గంటన్నరపాటు.. ఇంట్లోనే మొత్తం అన్ని ఫ్లోర్‌లు తిరిగాడు. ఆ తర్వాత ఇంటి నుంచి ఎలాంటి చోరీ చెయ్యకుండానే.. మళ్లీ వచ్చిన రూట్ లోనే బయటకు వెళ్లిపోయాడు. అయితే ఉదయం సీసీ కెమరాలు గమనించిగా ఒక వ్యక్తి ఇంట్లోకి చొరబడినట్లుగా గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సోమవారం నాడు స్వయంగా హైదరాబాద్ కమీషనర్ సీవీ ఆనంద్ స్పాట్‌కు విజిట్ చేసి అసలు దొంగ ఎలా ఎంటరయ్యాడు.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని దర్యాప్తు పర్యవేక్షించారు. డీకే అరుణ ఇంట్లో చొరబడ్డ వ్యక్తి ఎవరో త్వరగా పట్టుకుని.. ఆ మిస్టరీని చేజించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో.. స్వయంగా సీపీఐ రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్టేషన్‌లోనే నిందితుడిని విచారిస్తున్నారు. ఇతను పాత నేరస్థుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీలో, ఇతర రాష్ట్రాల్లో కూడా చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో అనేక చోరీలు చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం పోలీస్టేషన్ తీసుకొచ్చి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి.. నిందితుడిని విచారిస్తున్నారు. అసలు ఎందుకు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఇంతక ముందు చోరీ చేయడానికి రిక్కీ నిర్వహించడానికి వెళ్లాడా..? లేదంటే ఇంకేదన్నా కోణాలు ఉన్నాయా? అనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల్లోనే పోలీసులు కేసును చేధించారు. సీసీ కెమరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
కాగా సోమవారం నాడు ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. తమ ఇంట్లో అగంతకుడు ప్రవేశించడంతో.. తమ కుటుంబ సభ్యులు, తాను భయాందోళనకు గురయ్యాం అన్నారు. గత 38 ఏళ్లుగా తాను ఇదే ఇంట్లో ఉంటున్నానని.. ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని తెలిపారు. అగంతకుడు వచ్చిన సమయంలో ఇంట్లో మా కూతురు, మనవరాలు ఉంది. ఆ సమయంలో అలజడి విని తమ పాప, మనవరాలు లేచి ఉంటే.. ఆ వ్యక్తి దాడికి యత్నించే వాడేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. తాను నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ పరంగా ఎన్నో సార్లు ఇబ్బందికి గురయ్యానని, లోకల్‌గా అదనపు భద్రత కల్పించాలని చాలాసార్లు పోలీస్ అధికారులను కోరినా పట్టించుకోలేదన్నారు.
Also Read: 15 వేల కోట్ల పెట్టుబడులు.. 3 లక్షల ఉద్యోగాలు.. టూరిజం పాలసీ టార్గెట్ ఇదే..!
తనకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారని.. భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఇంట్లో ఒక్క వస్తువు కూడా చోరీ కాలేదు కాబట్టే అనుమానాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.