Ram Gopal Varma:రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మొన్నటి వరకు కాంట్రవర్సీ లతో సావాసం చేసిన ఈయన.. ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యారు అని చెప్పాలి. పైగా ఇకపై మంచి సినిమాలు చేస్తానని మొన్నా మధ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘శారీ.. టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ’ అనే ట్యాగ్ లైన్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో సోషల్ మీడియా ద్వారా తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆరాధ్య దేవి అలియాస్ శ్రీ లక్ష్మీ సతీష్ (Shri Lakshmi Satish) హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్, ట్రైలర్ తో పాటు పాటలు కూడా సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి.
వర్మ భయపడిపోయారా..?
ఇక వర్మ సినిమాల విషయాన్ని కాస్త పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో రాజకీయంగా ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. పలు పోలీస్ కేసుల్లో చిక్కుకొని బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్ సమయంలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Naidu), ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో పాటు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ల మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తెగ వైరల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వర్మపై ఈ విషయం మీద పలుచోట్ల కేసులు ఫైల్ అయ్యాయి. ఇక ఒకప్పుడు మనసులో మాట కూడా ముఖం మీద చెప్పే వర్మ ఇప్పుడు కాస్త భయపడుతున్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను విమర్శించిన పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) ను కూడా అరెస్టు చేయగా.. దీనిపై స్పందించమని అడిగితే తాను రాజకీయాలను ఫాలో అవ్వడం లేదని, తనకు ఏ విషయం తెలియదు అంటూ మాట తిప్పేశారు . దీంతో వర్మ భయపడిపోయారు అంటూ చాలామంది కామెంట్ చేశారు కూడా.
Tamannaah: బ్రేకప్ చేసిన గాయం.. తమన్నాలో ఇంత మార్పా..!
అమ్మాయిల్లో ఆ పార్ట్ అంటే ఇష్టం అంటున్న వర్మ..
ఇక ఇదిలా ఉండగా తాజాగా రాంగోపాల్ వర్మ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అదేంటంటే తాజాగా ప్రత్యూష అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రామ్ గోపాల్ వర్మను కలిసి..” మీరు ఎంతో మంది అమ్మాయిలను చూసే ఉంటారు. అమ్మాయిలలో మీకు నచ్చే బాడీ పార్ట్ ఏంటి? అని ప్రశ్నించింది. దానికి వర్మ నిజం చెప్పాలా? లేక అబద్ధం చెప్పాలా? అని అడగ్గా ఆమె నిజమే చెప్పాలి అని చెప్పింది. దాంతో మీరు దీనిని తీసుకోండి అంటూ కుర్రాళ్ళు ఊహించిన సమాధానమే చెప్పి షాక్ ఇచ్చారు వర్మ. ఇక దాంతో ఆమె కూడా కాస్త తలవంచి సిగ్గు పడినట్లు మనం ఆ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఈ అమ్మడికి “బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా ఫిక్స్” అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. “ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావని” ఇంకొంతమంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ వీడియోతో పాటు ఈమె కూడా పాపులర్ అయిందని చెప్పవచ్చు.
?utm_source=ig_web_copy_link