BigTV English

Manchu Brothers War : మంచు విష్ణు వర్సెస్ మనోజ్… ఓపెన్ ఫైట్‌కి రెడీ అయిపోయిన మంచు బ్రదర్స్

Manchu Brothers War : మంచు విష్ణు వర్సెస్ మనోజ్… ఓపెన్ ఫైట్‌కి రెడీ అయిపోయిన మంచు బ్రదర్స్

Manchu Brothers War : మంచు మనోజ్ (Manchu Manoj), మంచు విష్ణు (Manchu Vishnu) మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఈ ఇద్దరు అన్నదమ్ములు ఓపెన్ ఫైట్ కి రెడీ అవుతున్నారు. ఈ ఫైట్ రియల్ లైఫ్ లో కాదు రియల్ లైఫ్ లో. తాజా సమాచారం ప్రకారం మంచు విష్ణు ‘కన్నప్ప’ (Kannappa) మూవీ రిలీజ్ టైంలోనే మంచు మనోజ్ నటిస్తున్న ‘భైరవం’ (Bhairavam) మూవీ రిలీజ్ డేట్ కూడా పెట్టుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.


మంచు మనోజ్ వర్సెస్ విష్ణు

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న మూవీ ‘కన్నప్ప’. ఈ భారీ బడ్జెట్ మైథాలజికల్ మూవీలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా, మహాకవి ధూర్జటి రాసిన శ్రీ కాళహస్తీశ్వర మహత్యంలోని ‘భక్త కన్నప్ప’ చరిత్ర స్ఫూర్తితో ‘కన్నప్ప’ మూవీని రూపొందిస్తున్నారు డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్. ఈ మూవీని మంచు మోహన్ బాబు దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ బాబు, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్, మధుబాల, మంచు విష్ణు తనయుడు అవ్రామ్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ కీరోల్స్ పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 25న వేసవి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు మంచు విష్ణు. అయితే మరోవైపు ‘భైరవం’ మూవీని కూడా ఇదే డేట్ కి రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.


‘భైరవం’ టార్గెట్ ‘కన్నప్ప’

తమిళంలో సూరి, శేషు కుమార్, ఉన్ని ముకుందన్ కలిసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గరుడన్’. తెలుగులో ఈ మూవీని ‘భైరవం’ పేరుతో రీమేక్  చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. విజయ్ కనకమేడల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధ మోహన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచింది. అయితే ఈ మూవీని డిసెంబర్ 25న రిలీజ్ చేస్తారని ఇదివరకు టాక్ నడిచింది. ఆ తర్వాత సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారని అన్నారు. కానీ ఈ రెండు డేట్స్ లో కూడా మూవీ రిలీజ్ కాలేదు. దీంతో తాజాగా ‘భైరవం’ మూవీని ఏప్రిల్ 25న థియేటర్లోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మనోజ్ ఈ సినిమాలో పోషిస్తుంది మెయిన్ హీరో రోల్ కాకపోయినా, ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదం నేపథ్యంలో ‘భైరవం’ మూవీ రిలీజ్ డేట్ హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ ఈ రూమర్స్ ప్రకారమే ‘భైరవం’ మూవీని ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలనుకుంటే మంచు మనోజ్ – మంచు విష్ణు మధ్య అఫీషియల్ బాక్స్ ఆఫీస్ వార్ స్టార్ట్ అయినట్టే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×