E-Paper
Advertisement

Thief Murder : గుడిలో చోరికి ప్రయత్నం.. దొంగ హతం..

Thief Murder : గుడిలో చోరికి ప్రయత్నం.. దొంగ హతం..
Advertisement

Thief Murder : మేడ్చల్‌ జిల్లా కుషాయిగూడ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ దుండగుడు ప్రవేశించాడు. గర్భగుడిలోని హుండీ వద్దకు వెళ్లాడు. ఆ హుండీని పగల గొట్టేందుకు ప్రయత్నించాడు. ఆ శబ్దానికి ఆలయ వాచ్ మెన్ రంగయ్య మేల్కొన్నాడు. దొంగను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో దుండగుడు రంగయ్యపై రాళ్లతో దాడికి దిగాడు. ఈ క్రమంలో వాచ్ మెన్ తన వద్ద ఉన్న కర్రతో దొంగను బలంగా కొట్టాడు. దుండగుడి తలకు బలంగా దెబ్బ తగిలింది. వెంటనే అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.

ఉదయం ఆలయానికి వచ్చిన అధికారులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు. మృతుడి వద్ద దొరికిన ఫోన్ ఆధారంగా వివరాలు సేకరించారు. దొంగతనానికి వచ్చిన దుండగుడుని గండం రాజుగా గుర్తించారు. అతడి స్వస్థలం కామారెడ్డి జిల్లా ఆరేపల్లిని పోలీసులు తెలిపారు. ప రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. రాజు హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×