BigTV English
Advertisement

Pathaan: టాప్ 5లో ‘పఠాన్’… మ్యాజిక్ చేసిన షారూఖ్

Pathaan: టాప్ 5లో ‘పఠాన్’… మ్యాజిక్ చేసిన షారూఖ్

Pathaan:బాలీవుడ్ బాద్షా దాాదాపు నాలుగేళ్ల తర్వాత పూర్తి స్థాయి హీరోగా నటించిన చిత్రం ‘పఠాన్’. సింహం ఊర‌క‌నే వేటాడదు. కానీ వేటాడితే మాత్రం సాలిడ్‌గా ఉంటుంద‌ని అంటుంటారు క‌దా!. అలాంటి ఆక‌లిగొన్న సింహంలా షారూఖ్ ఖాన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేశారు. ఆయ‌న న‌టించిన తాజా యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ‘పఠాన్’ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.1000 కోట్ల క్ల‌బ్‌లోకి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో ఈ రేర్ ఫీట్‌ను సాధించిన చిత్రాలు నాలుగు మాత్ర‌మే ఉండేవి. అయితే ‘పఠాన్’ ఇప్పుడు ఐదో స్థానంలో నిలిచింది.


బాలీవుడ్‌లోనే ‘పఠాన్’ సినిమా రూ.499 కోట్ల రూపాయ‌ల నెట్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. ఇక మిగిలిన తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూ.17.97 కోట్లు వ‌చ్చాయి. అంటే మొత్తంగా చూస్తే ఇండియాలోనే నెట్ క‌లెక్ష‌న్స్ ప‌రంగా ‘పఠాన్’ సినిమా రూ.519 కోట్ల‌ను క్రాస్ చేసింది. గ్రాస్ క‌లెక్ష‌న్స్ ప్ర‌కారం చూస్తే దీని వేల్యూ రూ.623 కోట్లు. ఇక‌ ఓవ‌ర్ సీస్‌లో మొత్తంగా చూస్తే ఈ చిత్రానికి రూ.377 కోట్లు వ‌చ్చాయి. అంటే వ‌ర‌ల్డ్ వైడ్‌గా ‘పఠాన్’ సినిమా రూ.1001 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను రాబట్టుకుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. కోవిడ్ త‌ర్వాత ఈ రేంజ్‌లో హిట్ బాలీవుడ్‌కి రావ‌టం ఇదే తొలిసారి.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన చిత్రాల్లో ఆమిర్ ఖాన్ దంగ‌ల్ సినిమాకు రూ.1914 కోట్లు షేర్ క‌లెక్ష‌న్ష్ వ‌చ్చాయి. ఇక రెండో స్థానంలో బాహుబ‌లి 2 నిలిచింది. దీనికి రూ.1797 కోట్లు వ‌చ్చాయి. మూడో ప్లేస్‌లో KGF2 నిలిచింది. ఈ సినిమా రూ.1188 కోట్ల‌ను రాబ‌ట్టింది. నాలుగో స్థానంలో ట్రిపుల్ ఆర్ నిలిచింది. ఈ సినిమా రూ.1174 కోట్ల‌ను వ‌సూలు చేసింది. ఇక ఐదో స్థానంలో ప‌ఠాన్ సినిమా చేరింది.


సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ప‌ఠాన్ సినిమాను య‌ష్ రాజ్ ఫిలింస్ నిర్మించింది. దీపికా ప‌దుకొనె హీరోయిన్‌గా న‌టించింది. జ‌న‌వ‌రి 25న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా 8000 థియేట‌ర్స్‌లో రిలీజైంది.

Astrologer Venu Swamy:తార‌క‌ర‌త్న చ‌నిపోతాడ‌ని ఆస్ట్రాల‌జ‌ర్ వేణుస్వామికి ముందే తెలుసా?

Bhumi Pednekar: మ‌హేష్ సినిమాలో బాలీవుడ్ గ్లామ‌ర్ డాల్‌

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×