BigTV English

Russia Ukraine war:ఇండియాకు లాభం తెచ్చిపెట్టిన రష్యా, ఉక్రెయిన్ వార్..

Russia Ukraine war:ఇండియాకు లాభం తెచ్చిపెట్టిన రష్యా, ఉక్రెయిన్ వార్..

Russia Ukraine war:ప్రపంచ దేశాలు అన్ని ఎంత సన్నిహితంగా ఉన్నా ఏదో ఒక విషయంలో విబేధాలు వస్తూనే ఉన్నాయి. ఇక యుద్ధ వాతావరణం అనేది ఏ దేశాల మధ్య ఎప్పుడు ఏర్పడుతుందనేది నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఇటీవల రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధం ఇతర దేశాల మధ్య తీవ్ర ప్రభావమే చూపించింది. అంతే కాకుండా ఇది కొన్ని విషయాల్లో ప్రయోజనాన్ని కూడా ఇచ్చింది.


రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధం ఇండియన్ స్పేస్ ఏజెన్సీకి బాగానే కలిసొచ్చింది. కానీ ఇండియా తయారు చేస్తున్న సెమీ క్రయోజెనీక్ రాకెట్ ఇంజెన్ డెవలప్మెంట్ మాత్రం అకస్మాత్తుగా ఆగిపోయింది. అయితే ఇప్పటివరకు ప్రపంచ దేశాల్లో ఏ రెండిటి మధ్య యుద్ధం జరిగినా.. అమెరికాకు ప్రయోజనం ఉంటుంది అనుకునే నిపుణులు.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇండియాకు ప్రయోజనాన్ని తీసుకురావడం చూసి ఆశ్చర్యపోయారు.

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధం సమయంలో యూకేకు చెందిన నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్ (వన్ వెబ్) నుండి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు రూ.1000 కోట్ల విలువ చేసే శాటిలైట్ లాంచ్ కాంట్రక్ట్‌ను ఇచ్చింది. మామూలుగా వన్ వెబ్ శాటిలైట్ల తయారీ రష్యానే చేస్తుంది. కానీ ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉన్న సమయంలో శాటిలైట్ల తయారీ కష్టం కావడంతో రష్యా.. ఆ కాంట్రాక్ట్‌ను క్యాన్సిల్ చేసింది.


ఇస్రో ఆధీనంలో నడిచే న్యూస స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీఐఎల్) వన్ వెబ్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.1000 కోట్లు కాగా.. రెండు ఫేజ్‌లలో 71 శాటిలైట్లను లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చాలాకాలం క్రితం వన్ వెబ్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ స్వయంగా తెలిపారు. ఇప్పటికే మొదటి ఫేజ్‌గా 2022 అక్టోబర్‌లో 36 శాటిలైట్లు అంతరిక్షాన్ని చేరుకున్నాయి. తరువాత ఫేజ్‌కు సంబంధించిన 36 శాటిలైట్లు వచ్చే నెలలో లాంచ్ అవ్వనున్నట్టు ఇస్రో తెలిపింది.

ఇస్రోతో తమ అనుబంధాన్ని ఇలాగే కొనసాగించాలని అనుకుంటున్నట్టు వన్ వెబ్ ప్రకటించింది. వన్ వెబ్‌తో ఒప్పందంపై ఇస్రో కూడా సంతోషం వ్యక్తం చేసింది. రష్యా, ఉక్రెయిన్‌కు మధ్య యుద్ధం ఇస్రోకు ఉపయోగపడినా కూడా వారు తయారు చేస్తున్న సెమీ క్రయోజెనిక్ ఇంజెన్‌కు ప్రాజెక్ట్‌కు మాత్రం నష్టం కలిగిందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి ఇస్రోకు ఉక్రెయిన్ సాయం కావాల్సి ఉందని కానీ ఈ యుద్ధం వల్ల ఆ దేశం సాయం చేయలేక ఇంజన్ తయారీ ఆగిపోయినట్టుగా తెలుస్తోంది.

New Diploma Course:పోలీసులకు ఆ కోర్సు తప్పనిసరి.. దుబాయ్‌లో కొత్త రూల్..

Cyber Crimes in IT:ఐటీలో సైబర్ నేరాలకు అదే కారణం..!

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×