BigTV English

Congress Counter: కవితకు కౌంటర్.. AIతో ఏం చేశారో మరచిపోయారా?

Congress Counter: కవితకు కౌంటర్.. AIతో ఏం చేశారో మరచిపోయారా?

సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేయాలనుకున్న బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతలు రివర్స్ లో కౌంటర్లిచ్చారు. ఇటీవల HCU విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ తో చేసిన వీడియోలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలుసు. వీటిపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఏఐ ఫేక్ వీడియోలు ప్రమాదకరం అన్నారు. దీనికి ప్రతిగా ఎమ్మెల్సీ కవిత.. ఏఐతో ప్రమాదం లేదని, వాస్తవానికి అనుముల ఇంటెలిజెన్స్‌(ఏఐ)తోనే రాష్ట్రానికి ప్రమాదమని వ్యాఖ్యానించారు. అనుముల ఇంటెలిజెన్స్ అంటూ ఆమె సెటైర్లు పేల్చగా కాంగ్రెస్ నేతలు కౌంటర్లతో రెడీ అయ్యారు. గతంలో ఏఐ వాడి బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వంటివి చేశారని, వాటిని ఇప్పుడు అనుముల ఇంటెలిజెన్స్ తోనే బయటకు లాగుతున్నామని చెప్పారు. ఆ ఏఐ కంటే ఈ ఏఐతోనే మేలు అని అన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.


కవిత ఏమన్నారు..?
అనుముల ఇంటెలిజెన్స్ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు కవిత. ఆ ఇంటెలిజెన్స్ పక్కకు తప్పుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. ప్రజలను మోసం చేస్తున్నారని, కుల గణనను తప్పుదోవ పట్టించారని, బీసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు కవిత. సర్వే వివరాలను అసెంబ్లీలో పెట్టకుండా మోసం చేస్తున్నారని చెప్పారామె.

కవితపై చామల సెటైర్లు..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. అనుముల ఇంటలిజెన్స్ అని మాట్లాడుతున్నారని, వాళ్లు ఏఐ ఇంటెలిజెన్స్ తో ఫోన్ ట్యాపింగ్ లు చేశారని, దానిని అనుముల ఇంటెలిజెన్స్ ఉపయోగించి బయటికి తీస్తున్నామని తెలిపారు ఎంపీ చామల. అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోబాపూలే విగ్రహం పెట్టాలని కవిత ధర్నా చేస్తుంటే నవ్వొస్తోందన్నారు. ఆమెను ఎవరూ గుర్తించడం లేదని, అందుకే ఆమె ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిత్యం వార్తల్లో ఉండేందుకు కవిత ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఏదో ఒక అంశాన్ని పట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కవితకు మీడియా స్పేస్ ఇచ్చి, టీఆర్పీ పెంచాలని సెటైర్లు పేల్చారు. జైలుకు వెళ్లొచ్చిన తర్వాత కవిత తన సొంత గ్రాఫ్ పెంచుకునే పనిలో పడ్డారని, బాహుబలి సినిమాలో మాహిష్మతి సామ్రాజ్యానికి లేడీ డాన్ లా కవిత నిలవాలనుకుంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు చామల.


అక్కడ కేంద్ర మంత్రి.. ఇక్కడ కార్పొరేటర్
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కూడా ఎంపీ చామల కౌంటర్లిచ్చారు. బండి గూరించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడే కేంద్ర మంత్రి అని, తెలంగాణలో ల్యాండ్ అవగానే, కేంద్రమంత్రి నుంచి కార్పోరేటర్ అయిపోతారని అన్నారు. కార్పోరేటర్ గా పరకాయ ప్రవేశం చేస్తారని, అవగాహన లేకుండా మాట్లాడతారని చెప్పారు. 2003లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు HCU భూములు అన్యాక్రాంతం అయ్యాయని, అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. దీనిపై ఏమాత్రం అవగాహన లేని బండి సంజయ్.. సీబీఐ ఎంక్వైరీ వేస్తామని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆనాడు ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఇప్పటి అదే ప్రభుత్వం ఎంక్వయిరీ వేస్తుందా అని ప్రశ్నించారు.

Related News

Raksha Bandhan tragedy: చనిపోయిన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

Necklace Road Flyover: 8 నిమిషాల్లో బేగంపేట?.. నక్లెస్ రోడ్ పై కొత్త ఫ్లైఓవర్ స్కెచ్ ఇదే!

CM Revanth Reddy: ముందు చట్టం తెలుసుకో.. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ కౌంటర్

Telangana Rains: మరో 2 గంటల్లో భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల్లో తస్మాత్ జాగ్రత్త!

Kova Lakshmi: కాంగ్రెస్ నేతను వాటర్ బాటిల్ తో కొట్టిన BRS ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే?

CM Revanth Reddy: మా కమిట్మెంట్ నిరూపించుకున్నాం.. పది రోజులు చాలన్న సీఎం రేవంత్

Big Stories

×