OTT Movie : కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు, మన ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోయారు. కొంతకాలం క్రితం వరకు ఇవి ఎలా ఉంటాయో కూడా తెలియని మనవాళ్లు, ఇప్పుడు వీటిని చూస్తూ టీవీలకు అతుక్కుపోతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియన్ మూవీ ఒక డిఫరెంట్ స్టోరీ తో తెరకెక్కింది. ప్రకృతి వైపరీత్యంతో భూమి మీద మనుషులు, బతకడానికే భయపడుతూ ఉంటారు. మంచి నీళ్లకు కూడా మనుషులను చంపుకుంటూ ఉంటారు. ఇక్కడ హీరో చేసే విన్యాసాలు బాగా ఆకట్టుకుంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే…
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ అపోకలిప్టిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బాడ్‌ల్యాండ్ హంటర్స్’ (Badland Hunters). 2024 లో వచ్చిన ఈ మూవీకి, తొలిసారిగా హియో మ్యుంగ్-హ్యాంగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2023 లో వచ్చిన ‘Concrete Utopia’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇందులో మా డాంగ్-సియోక్, లీ హీజూన్, లీ జూన్-యంగ్, రో జియాంగ్-యుయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక విపత్తు తరువాత ఈ స్టోరీ మొదలవుతుంది . ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో జనవరి 26, 2024 నుంచి అందుబాటులో కి వచ్చింది .
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరుగుతుంది. ఇక్కడ ఒక భయంకరమైన భూకంపం వచ్చి నగరాన్ని నాశనం చేస్తుంది. ఆతరువాత ఇక్కడ చట్టవిరుద్ధమైన, అరాచక పాలన సాగుతుంది. సమాజం కుప్పకూలిపోతుంది. అక్కడ జీవించడం అనేది ఒక విలాసంగా మారుతుంది. బ్రతకడానికి ప్రజలు తీవ్రంగా పోరాడాల్సి వస్తుంది. ఇందులో హీరో భయంలేని ఒక వేటగాడిగా పేరు తెచ్చుకుంటాడు. అతను తన స్నేహితుడు చోయ్ జీ వాన్ తో కలిసి ఒక చిన్న గ్రామంలో జీవిస్తూ ఉంటాడు. వేటాడి సేకరించిన వనరులతో కొంతమందికి సహాయం చేస్తుంటాడు. అయితే, వారి గ్రామంలోని ఒక యువతి సూ-నా, ఒక విచిత్ర శాస్త్రవేత్త డాక్టర్ యాంగ్ గీ-సూ చేత కిడ్నాప్ చేయబడుతుంది. ఈ డాక్టర్ మానవులపై ప్రమాదకరమైన ప్రయోగాలు చేస్తూ, కొత్త జాతిని సృష్టించాలనే పిచ్చి ప్రయత్నంలో ఉంటాడు. హీరో ఇప్పుడు సూ-నాను రక్షించేందుకు ఒక ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఈ ప్రయాణంలో అతను డాక్టర్ అనుచరులను, అలాగే అతని ప్రయోగాల వల్ల సృష్టించబడిన వికృత జీవులను ఎదుర్కొంటాడు. ఈ పోరాటంలో హీరోకు సహాయంగా ఒక స్పెషల్ ఫోర్సెస్ సైనికురాలు కూడా చేరుతుంది. వీరిద్దరూ కలసి ఆ క్రూరమైన సైంటిస్ట్ భరతం పడతారు. ఈ యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. చివరికి ఆ అమ్మాయిని హీరో కాపాడుతాడా ? ఆ అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశారు? హీరో ఆ శక్తివంతమైన విలన్స్ ను ఎలా ఎదుర్కుంటాడు ? ఈ విషయాలను మీరు కూడా, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి. ఈ సినిమాలో ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ , మానవ సంబంధాల విలువలను తెలియజేసే సందేశాలు ఉంటాయి.