Big Stories

Gold Smuggling: సాక్సుల్లో 2 కిలోల బంగారం.. ముగ్గురు అరెస్ట్.. థింక్ డిఫరెంట్ గురూ!

gold seiz

Gold Smuggling: శంషాబాద్ విమానాశ్రమంలో భారీగా బంగారం పట్టివేత. ఇది రెగ్యులర్ న్యూస్. ఈసారి కూడా అక్రమంగా బంగారం తరలిస్తున్న ముగ్గురిని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. వారి నుంచి దాదాపు 1.30 కోట్ల విలువైన.. 1.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రియాద్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ముగ్గురు ప్రయాణికులను తనిఖీ చేయగా.. సాక్స్‌ల్లో పేస్ట్ రూపంలో బంగారాన్ని దాచి తీసుకొస్తుండగా ఇలా దొరికిపోయారు. ఆ ముగ్గురు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు.

- Advertisement -

ఆ ముగ్గురు మరీ అంత ఈజీగా బంగారాన్ని ఎలా తీసుకొద్దామని అనుకున్నారో ఏమో. ఎక్కడెక్కడో దాచిన బంగారాన్నే కస్టమ్స్ అధికారులు పట్టేసుకుంటున్నారు. అలాంటిది సాక్సుల కింద దాస్తే దొరికిపోరా? బొత్తిగా ఐడియా లేనట్టుంది వారికి.

- Advertisement -

శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు మహా ఖతర్నాక్. ఎలాంటి కిలాడీలైనా.. ఎంత స్మార్ట్‌గా బంగారం తరలించాలనుకున్నా.. ఇట్టే దొరకబట్టేస్తున్నారు. కడుపులో దాచినా, చాక్లెట్ రేపర్స్‌గా మార్చినా, మిక్సీలో పెట్టినా.. ఎలా చేసినా, ఎంత క్రియేటివ్‌గా ఆలోచించినా.. కస్టమ్స్ వాళ్లు మాత్రం అంతకుమించి చెక్ చేస్తున్నారు. అధునాతన స్కానింగ్ పరికరాలతో ఒక్క గ్రామ్ బంగారాన్ని కూడా అక్రమంగా గేటు దాటనివ్వడం లేదు. అలాంటిది.. ఈ ముగ్గురు కేటుగాళ్లు ఎంచక్కా సాక్సుల కింద గోల్డ్ దాచేస్తే.. దొరకరా మరి? అందుకే, థింక్ డిఫరెంట్ అంటారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News