BigTV English

Tiger-Donkey: పులి గాడిద స్టోరీ.. నేటి రాజకీయాలకు సరైన నీతి..!

Tiger-Donkey: పులి గాడిద స్టోరీ.. నేటి రాజకీయాలకు సరైన నీతి..!

Tiger-Donkey: గడ్డి నీలం రంగులో కదా ఉండేది?” అని ఒక గాడిద పులిని అడిగింది. దానికి పులి, “నీ మొహం! గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి?.. ఆకుపచ్చ రంగులో ఉంటుంది” అని జవాబిచ్చింది.. గాడిద “ఏడ్చావులే! గడ్డి నీలం రంగులోనే ఉంటుంది” అని వాదించింది.. అలా అలా గాడిదకు పులికి వాగ్వాదం పెరిగింది… ఎవరి మాట సరైందో తేల్చుకోవడానికి అవి రెండూ అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకొన్నాయి….
దట్టమైన అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో సింహం హూందాగా కూర్చొని ఉంది. అక్కడికి చేరుకోగానే పులికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గాడిద “వన రాజా! వన రాజా!… గడ్డి నీలం రంగులో కదా ఉండేది.. అవునా కాదా? మీరే చెప్పండి ” అంది.
“అవును! గడ్డి నీలం రంగులోనే ఉంటుంది” అంది సింహం
అది విని గాడిద ఇంకా రెచ్చిపోతూ … “చూడండి మహారాజా! అలా అని నేను ఎంత చెప్పినా ఈ పులి ఒప్పుకోవడం లేదు, అలా కాదని నాతో వాదిస్తుంది, దీనికి తగిన శిక్ష పడవలసిందే” అంది
“అవును, పులికి తప్పకుండా శిక్ష పడవలసిందే.. పులిని ఒక సంవత్సరం పాటు జైలులో ఉంచండి!!” అని ఆదేశించింది సింహం
పెల్లుబికిన ఉత్సాహంతో రంకెలేసుకుంటూ అడవంతా పరిగెత్తడం మొదలెట్టింది గాడిద ..
పులి నీరసంగా సింహం దగ్గరకు వెళ్ళి ” అదేమిటి మహారాజా! గడ్డి ఆకుపచ్చ రంగులో కదా ఉండేది?” అంది
“అవును గడ్డి ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది!” అంది సింహం
“మరి నాకెందుకు శిక్ష విధించారు మహారాజా?” అంది పులి
దానికి సింహం “గడ్డి నీలం రంగులో ఉంటుందా? లేక ఆకుపచ్చ రంగులో ఉంటుందా? అనే విషయం గురించి నిన్ను శిక్షించడం జరగలేదు. బుద్ధిలేని ఒక గాడిదతో వాదించి, మరలా దానికి తీర్పు ఇవ్వమని నా దగ్గరకు వచ్చినందుకు నీకు శిక్ష పడింది..” అంది
నీతి – 2023 & 2024 ఎన్నికలలో ఉత్తమమైన
అభ్యర్ధులకే ఓటెయ్యండి..
గా డి ద ల తో ……….
వాగ్వివాదాలు పెట్టుకోకండి..
లేకపోతే
ఐదేళ్ళు శిక్ష పడుతుంది..!


ఈ ఐటమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Note: వాట్సాప్ నుంచి సేకరణ


Tags

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×