E-Paper
Advertisement

Tiger Tension: తెలంగాణ అటవీ ప్రాంతాల్లో టైగర్ టెన్షన్.. గ్రామస్తుల్లో భయం భయం

Tiger Tension: తెలంగాణ అటవీ ప్రాంతాల్లో టైగర్ టెన్షన్.. గ్రామస్తుల్లో భయం భయం
Advertisement

కరీంనగర్ రూరల్ లో
పెద్దపులి ఆనవాళ్లు

ములుగు జిల్లాలో
పెద్దపులి సంచారం

Advertisement

సిద్ధిపేట జిల్లాలో
టైగర్ టెన్షన్

మహబూబాబాద్ జిల్లాలో
టైగర్ పగ్ మార్క్స్

Advertisement

మెదక్ జిల్లాలోనూ
పులి పాద ముద్రలు

ఇవీ ఇటీవలి పులి సంచారానికి సంబంధించిన వార్తలు. కరీంనగర్ రూరల్ మండలం, బహుదూర్ ఖాన్ పేటలో పెద్దపులి సంచరించినట్టు ఆనవాళ్లు కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఇక్కడి వాళ్లు. గుర్రం భూమిరెడ్డి అనే రైతు పొలంలో పెద్ద పులి పాదముద్రలను గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన వెళ్లి ఘటనా స్థలిని పరిశీలించారు అటవీ శాఖ అధికారులు. ఇక్కడ పులి సంచారం జరిగినట్టు గుర్తించి.. పంట పొలాలకు వెళ్లే రైతులు.. ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారం గుర్తించారు. జూకారం- మల్లంపల్లి సరిహద్దు అడవిలో పెద్దపులి సంచరించినట్టు ఆనవాళ్లు కనిపించాయి. పగ్ మార్క్స్ చూసి ఇక్కడ పులి తిరిగినట్టుగా నిర్దారించారు. కొన్నాళ్ల క్రితం భూపాలపల్లి జిల్లాలో తిరిగిన పులి ములుగు వైపు వచ్చినట్టు అనుమానిస్తున్నారు. శనివారం నాడు భూపాలపల్లి జిల్లాలోని జడలపేట దగ్గర ఆవును చంపి తిన్నది పెద్ద పులి. రెండు జిల్లాల అటవీ ప్రాంతంలో పులి సంచారంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శివారు ప్రాంత ప్రజలు. పులి పాద ముద్రలను ట్రాక్ చేస్తున్నారు అటవీ శాఖ సిబ్బంది.

ఇక సిద్ధిపేట జిల్లాలో పెద్ద పులి టెన్షన్ వదలడం లేదు. గత వారం రోజులుగా అటవీ అధికారులు పులి జాడ పసిగట్టడం కోసం అన్ని యత్నాలు చేస్తున్నారు. ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతున్నారు ఫారెస్ట్ అధికారులు. అందులో భాగంగా మహారాష్ట్ర తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఎక్స్ పర్ట్ టీమ్ సిద్ధిపేటకు వచ్చి పులి సంచరించిన ప్రాంతాలను సందర్శించారు. పులి జాడ కోసం 6 స్పెషల్ టీములు, 15 కెమెరాలు ఏర్పాటు చేసి.. 45 మంది ఫారెస్టు సిబ్బంది సాయంతో గాలిస్తున్నారు. తొగుట మండలంలోని గోవర్ధనగిరి, కొండాపూర్, గుడికందుల, వర్ధరాజ్ పల్లిలో పులి సంచరిస్తున్నట్టు.. ఈ పాద ముద్రల ఆధారంగా అధికారులు ఒక నిర్దారణకు వచ్చారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి.. పాదముద్రల గుర్తింపు వంటి అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. పులిని ఈ ప్రాంతం నుంచి పంపే వరకూ పశువుల కాపరులు, రైతులు, అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లాలోనూ పులి సంచారం ఈ ప్రాంత వాసుల వెన్నులో ఒణుకు పుట్టిస్తోంది. కొత్తగూడ మండలం, రెన్యా తండా చౌకీబాట బీటు పరిధిలో పెద్ద పులి ఆనవాళ్లను గుర్తించారు అటవీ శాఖ అధికారులు. ములుగు జిల్లా, జాకారం ప్రాంతం నుంచి పులి ఎటు వెళ్లిందని అటవీ శాఖ అధికారులు ఒక పక్క పరిశీలిస్తుండగా.. గూడూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కొత్తగూడ మండలం రేన్య తండా సమీప అటవీ ప్రాంతం చౌకీబాట బీటు నుంచి పులి వెళ్లినట్టు గుర్తించారు.

పులి సంచారం కారణంగా పశువుల కాపరులు అడవిలోకి వెళ్లరాదని.. అటవీ ఉత్పత్తుల కోసం ఇటు వైపు ఎవ్వరూ వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. మరీ ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు రావొద్దని.. సూచించారు. కర్ణగండి గ్రామం మీదుగా కార్లాయి, దొరవారి తిమ్మాపురం గ్రామాల వైపు పులి సంచరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు భావించి అన్ని బీట్ల పరిధిలోని సిబ్బందిని ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. కొత్తగూడ మండలం పూనుగొండ్ల అటవీ ప్రాంతంలో గతేడాది సరిగ్గా జనవరి 1న ఇలాగే ట్రాప్ కెమెరాకు చిక్కింది పెద్దపులి. సరిగ్గా ఏడాదికి మళ్లీ పులి ప్రత్యక్షం కావడంతో ఉలిక్కి పడ్డారు అధికారులు. మేటింగ్ టైంలో ఉన్నపుడు పులులు ఒకదాని కోసం మరొకటి వెతుకుతూ తిరుగుతుంటాయని.. చెబుతున్నారు అధికారులు.

Also Read: కేసీఆర్ మళ్లీ అసెంబ్లీకి వస్తారా? ఆ మాటలకు అర్థం అదేనా?

ఇక మెదక్ జిల్లా బొప్పాపూర్ కూడవెల్లి వాగు సమీపంలో పులి పాదముద్రల్లాంటివి కనిపించాయి. దీంతో ఈ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఉదయం తాము పొలం వద్దకు వెళ్లే సరికి పెద్ద పెద్ద అడుగులు తమకు కనిపించాయనీ.. వీటిని మొబైల్ ఫోన్ లో చిత్రించి ఫారెస్ట్ అధికారులకు పంపామని అన్నారు. ఈ పులికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×