BigTV English

Tigers Death Case : పులుల మృతి కేసు.. విషప్రయోగమే కారణం.. నిర్థారించిన పోలీసులు

Tigers Death Case : పులుల మృతి కేసు.. విషప్రయోగమే కారణం.. నిర్థారించిన పోలీసులు

Tigers Death Case : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా.. కాగజ్ నగర్ కారిడార్ లో పులులు మృతి చెందిన వ్యవహరం హాట్ టాపిక్ గా మారింది. దరిగాం అటవీ ప్రాంతంలో పులి మరణానికి.. రెండిటి మధ్య జరిగిన ఆదిపత్య పోరు కారణం కాదని.. ఎవరో మాటు వేసి మందు పెట్టి రెండు బెబ్బులను హతమార్చారని తేలడంతో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఎన్టీసీఏ, పీసీసీఎఫ్ చీఫ్ ఆర్ఎం డెబ్రియాల్ రంగంలోకి దిగి విచారణ చేపట్టడంతో అసలు గుట్టు రట్టైంది. ఇక ఈ కేసులో విష ప్రయోగానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించగా.. తల్లిదండ్రుల హామీతో మరో మైనర్ బాలుడిపై నిఘా ఉంచి.. వదిలిపెట్టినట్టు సమాచారం అందుతుంది.


కాగా ఇప్పటికే పులులు చనిపోయింది పశువు మాంసం తినడం కారణంగానేనని.. ఆ పశువు చనిపోయాక దానిపై గడ్డి మందు చల్లి, విషగులికలు కలిపారని.. అందువల్లే పులులు హతమయ్యాయని అధికారుల విచారణలో తేలింది. అయితే చనిపోయింది రెండు పులులే అయినా.. మరో రెండు పులులు మిస్ అవడంతో.. ఈ వ్యవహారం మరింత తీవ్ర రూపం దాల్చింది. దీంతో కనిపించకుండా పోయిన ఆ రెండు పులుల ఆచూకీ కోసం హైలెవల్ సర్చ్ ఆపరేషన్ ను అటవీ శాఖ అధికారులు చేపడుతున్నారు. ఆరు డివిజన్ల పరిధి లోని అటవీ శాఖ సిబ్బంది దరిగాం అడవిని జల్లెడ పడుతూ పులి జాడ కోసం వెతుకులాడుతున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×