Big Stories

Farmhouse mlas : 4+4 గన్‌మెన్లు.. ఆ నలుగురికి టైట్ సెక్యూరిటీ..

Share this post with your friends

Farmhouse mlas: 4+4 గన్‌మెన్లు. బుల్లెట్ ఫ్రూఫ్ కారు. ఎస్కార్ట్ వాహనం. ఇంటి దగ్గర పోలీస్ భధ్రత. ఇలా మంత్రుల స్థాయిలో ఆ నలుగురు ఫాంహౌజ్ ఎమ్మెల్యేలకు భద్రత పెంచింది ప్రభుత్వం. పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్థన్ రెడ్డి, గువ్వల బాలరాజులకు టైట్ సెక్యూరిటీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ హోంశాఖ.

ఫాంహౌజ్ కేసు సంచలనంగా మారిన నేపథ్యంలో ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల భద్రత విషయంలో ఆందోళన నెలకొంది. వారిని టార్గెట్ చేసే అవకాశం ఉందనే నివేదికతో ఆ నలుగురికి పటిష్ట భద్రత కల్పించింది సర్కారు. ఫాంహౌజ్ ఎపిసోడ్ అంతా డ్రామా అంటూ.. కేసీఆర్ కామెడీ షో అంటూ.. బీజేపీ ఎద్దేవా చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఫాంహౌజ్ వీడియో రికార్డింగ్స్ ను దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు పంపించి.. బీజేపీని సవాల్ చేశారు సీఎం కేసీఆర్.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News