Telangana TDP President : తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నియమితులయ్యారు. కాసాని జ్ఞానేశ్వర్ నవంబర్ 10న అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటి వరకు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు ఉన్నారు. తాజాగా ఆయనకు పొలిట్ బ్యూరో స్థానం కల్పించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నర్సింహులును నియమించారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీకి ఎల్ . రమణ గుడ్ బై చెప్పిన సమయంలో నర్సింహులుకు పార్టీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు చంద్రబాబు అప్పగించారు.