BigTV English

North Korea South Korea War : కొరియా దేశాల మధ్య యుద్ధ సంకేతాలు..

North Korea South Korea War : కొరియా దేశాల మధ్య యుద్ధ సంకేతాలు..

North Korea South Korea War : ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య యుధ్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరుదేశాల మధ్య యుధ్ద వాతావరణం ఇప్పటికే మొదలైంది. దక్షిణ కొరియా క్షిపణి ప్రయోగాల్లో దూకుడు పెంచింది. దక్షణ కొరియా, ఉత్తర కొరియా మధ్య మిలిటరీ డీమార్కేషన్ లైన్ ఉంది. ఈ డీమార్కేషన్‌కు 12 మైళ్ల దూరంగా ఉత్తర కొరియా 180 యుద్ధ విమానాలను మోహరించింది.


దీన్ని తమనించిన దక్షిణ కొరియా 80 యుద్ధ విమానాలను మోహరించింది. ఇరు దేశాలు.. నువ్వా నేనా అంటే యుద్ధ విమానాలను మోహరిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఉత్తర కొరియా కొంత దూకూడు పెంచిందని చెప్పుకోవచ్చు.

ఈ యుద్ధ వాతావరణాన్ని గమనించి జపాన్.. ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు సురక్షితమైన భవనాలకు తరలివెళ్లలని.. భూగర్భ ప్రదేశంలో తలదాచుకోవాలని అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. బుధవారం నుంచి ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగించడం మొదలు పెట్టింది.


కేవలం రెండు రోజుల్లోనే ఉత్తర కొరియా 30కి పైగా మిసైళ్లను ప్రయోగించింది. 1953లో కొరియా యుధ్దం తరువాత మొదటి సారి ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు ఎదురయ్యాయని పలువురు అంటున్నారు. ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణుల్లో ఓ క్షిపణి శకలం దక్షిన కొరియా భూభాగంలో పడింది. అయితే 2018లో ఉత్తరకొరియా, దక్షిణ కొరియాకు మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉత్తర కొరియా తుంగలో తొక్కుతోందని దక్షణ కొరియా అంటోంది. అటు జపాన్‌ ప్రభుత్వం కూడా అప్రమత్తమై.. పలు ప్రాంతాల్లో బుల్లెట్ ట్రైన్ సేవలను నిలిపివేసింది.

Tags

Related News

Minneapolis shooting: మినియాపొలిస్‌లో రక్తపాతం.. చర్చి స్కూల్‌పై రైఫిల్ దాడి.. అసలేం జరిగిందంటే?

Trump Statement: భారత్, పాక్ కి నేనే వార్నింగ్ ఇచ్చా.. మరింత గట్టిగా ట్రంప్ సెల్ఫ్ డబ్బా

Trump’s Tariff War: ట్రంప్ టారిఫ్ స్టార్ట్! భారత్‌కు కలిగే నష్టాలు ఇవే..

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Big Stories

×