Tollywood Producer Natti Kumar Sensational Comments On Ktr : మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ భారీ కుదుపులకు లోనవుతోంది. ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఇండస్ట్రీని చాలా కాలంగా వేధిస్తున్నాయట. ఇక జానీ మాస్టర్ అంశం సైతం సినీ ప్రేమికులను కలవరపరిచింది. ఇప్పుడు తాజాగా మంత్రి కేటీఆర్ పై సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన తీవ్ర ఆరోపణలు చెలరేగాయి.
ఫోన్ ట్యాపింగ్ అంశంపై టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంబంధించి అన్ని ఆధారాలు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీనిపై బాధితులు వచ్చి కంప్లైంట్ ఇస్తేనే నిజనిజాలు బయటపడతాయన్నారు. లేదంటే స్వచ్ఛందంగా కేటీఆర్ తనపై విచారణకు ఆయనే ఆదేశించుకోవాలన్నారు. ఒక బంధం విడిపోవడం చాలా బాధకరమైన విషయమని, దానిపై తానేం కామెంట్ చేయనని సమంత, నాగచైతన్యల గురించి అన్నారు. దీనిపై సమంత సమాధానం చెప్పాలన్నారు.
కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయాల్లో సెగ పుట్టిస్తున్ననేపథ్యంలో బిగ్ టీవీతో నట్టి కుమార్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె కుండబద్దలు కొట్టినట్లు నిజమే మాట్లాడిందన్నారు. మా ఇండస్ట్రీలో ఇలాంటిది జరిగింది అని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా అని సవాల్ విసిరారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను సూటిగా అడుగుతున్నానని, ఈ అంశంపై విచారణ వేసుకోవాలని నట్టికుమార్ సూచించారు.
తాను ఏ తప్పు చేయలేదని మంత్రి కేటీఆర్ ఒప్పుకోవాలన్నారు. ఇండస్ట్రీలోని వాళ్లను డ్రగ్స్ కేసులో ఎందుకు ఇరికించారు, మళ్లీ ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చారని ఆయన నిలదీశారు. ఇందులో నిజమెంత అన్న అంశంపై ఆయన అంతరాత్మను చెప్పమనండన్నారు.
also read : కొండా సురేఖ గారు.. మీవి దొంగ ఏడుపులు.. పెడబొబ్బలు: కేటీఆర్
కేటీఆర్ మా సినిమా వాళ్లకు ఎలా దగ్గరయ్యాడని, ఎక్కడ దగ్గరయ్యాడు, ఆయన ఇంతకుముందు ఏ సినిమాకు పరిచయం లేదు కదా, అలాంటిది ఇండస్ట్రీతో సన్నిహిత్యం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కనీసం కవితక్క అయినా తమకు పరిచయం అని, తమ షూటింగ్ లకు ఆమె వచ్చేదన్నారు.
ఇక కేసీఆర్ కు తమలో కొంతమందితో మాత్రమే పరిచయం ఉందన్నారు. అంతేగానీ కేటీఆర్ ఇక్కడ లేరని, ఆయన అమెరికాలో ఉన్నారని గుర్తు చేశారు. ఇక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అంశంపైనా నట్టి కుమార్ స్పందించారు. ఆయన్ను కావాలనే ఇరికించారని చెప్పుకొచ్చారు.