BigTV English

Suriya To Karthi: ఇలాంటి స్క్రిప్ట్స్ నీకు మాత్రమే ఎలా దొరుకుతాయి రా.?

Suriya To Karthi: ఇలాంటి స్క్రిప్ట్స్ నీకు మాత్రమే ఎలా దొరుకుతాయి రా.?

Suriya To Karthi: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో కార్తీ ఒకరు. పేరుకు తమిళ్ హీరో అయినా కూడా విపరీతమైన తెలుగు ప్రేక్షకుల ఫాలోయింగ్ సాధించుకున్నాడు కార్తీ. చాలా సందర్భాలలో కూడా కార్తీ చాలా బహిరంగంగా మీకు తమిళ్ ప్రేక్షకులు ఇష్టమా, తెలుగు ప్రేక్షకులు ఇష్టమా అంటే తెలుగు ప్రేక్షకులు ఇష్టమని చెప్పాడు. తెలుగు ప్రేక్షకులు కూడా కార్తీ సినిమాను అంతలా ఆదరిస్తారు. ఇక రీసెంట్ గా సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన సత్యం సుందరం సినిమాకి కూడా తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పెట్టారు. ఇదివరకే సి ప్రేమ్ కుమార్ 96 అనే సినిమాకి దర్శకత్వం వహించారు. భాషతో సంబంధం లేకుండా ఆ సినిమాను విపరీతంగా ప్రేక్షకులు ఆదరించారు. ఆదర్శకుడి నుంచి రెండవ సినిమా వస్తుంది అనగానే అందరికీ అంచనాలు మొదలయ్యాయి. అంచనాలను కూడా చాలా సక్సెస్ఫుల్ గా అందుకున్నాడు.


ఈ సినిమాని 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య మరియు జ్యోతిక నిర్మించారు. ఈ బ్యానర్ లో ఇదివరకే ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఇకపోతే ఈ సినిమా మొదట స్క్రిప్ట్ ను సూర్యకి అందించారు కార్తి. సూర్య ఈ స్క్రిప్ట్ చదవగానే బాగా ఇంప్రెస్ అయిపోయారు. ఇలాంటి అద్భుతమైన స్క్రిప్ట్స్ నీకు మాత్రమే ఎలా దొరుకుతాయి రా అంటూ కార్తిని ప్రశంసించారు. 96 సినిమా అయిపోయిన తర్వాత సి ప్రేమ్ కుమార్ మొదట ఈ కథను రాసుకొని కార్తీను కలిసే ప్రయత్నం చేశారు. అయితే ఈ కథ కార్తీక్ నచ్చుతుందో నచ్చదు అని మొదట సందేహంలో పడ్డారు దర్శకుడు ప్రేమ్ కుమార్. కార్తీ కథను చెప్పమని అడిగినప్పుడు కూడా, ఈ కథను నేరేట్ చేయకుండా స్క్రిప్ట్ చదవమని ఇచ్చేసారు. ఇది బాగా నచ్చిన కార్తీ సినిమా చేసేసారు.

ఇక తమిళ్లో ఈ సినిమా హిట్ అవడం మాత్రమే కాకుండా తెలుగులో కూడా గొప్ప సినిమాలు ఖచ్చితంగా హిట్టవుతాయని మరోసారి నిరూపించింది. ఇక కార్తీక్ కెరియర్లో ఎన్నో కాన్సెప్ట్ బేస్ సినిమాలో వచ్చాయి. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలు పెట్టిన కార్తి “పరుత్తివీరన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత కాలంలో చేసిన యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ వంటి సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగర్జున తో పాటు ఊపిరి సినిమాలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు.


ఇక రీసెంట్ గా వచ్చిన సత్యం సుందరం సినిమా కూడా ఊపిరి సినిమాలానే చాలామంది ప్రేక్షకులకు పర్సనల్గా కనెక్ట్ అయింది అని చెప్పాలి. సరిగ్గా రాస్తే మూడు పేజీలు మాత్రమే ఉండే ఈ కథ, బాల్యంలోని ఎన్నో జ్ఞాపకాలను తట్టి లేపుతూ మనసును మెలి పెట్టింది. కొన్నిచోట్ల నవ్విస్తూ మరికొన్ని చోట్ల కంటతడి పెట్టిస్తూ మొత్తంగా ఈ సినిమా ఒక అనుభూతిని కలిగించింది. సూర్య లాంటి హీరోలు ఈ కథను నిర్మించడం. కార్తీ లాంటి హీరో ఇటువంటి కథను ఒప్పుకొని సినిమా చేయటం వలన ఇటువంటి సినిమాలు ఇంకా నిర్మితమయ్యే అవకాశం ఉంది. అలానే మంచి సినిమాకి ఎప్పుడు ఆదరణ లభిస్తుంది.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×