Asaduddin Owaisi: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని ఎమ్ఐఎమ్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ బస్తీలు గత పది ఏళ్లలో పూర్తిగా వెనుకబడ్డాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పదేళ్ల పాటు కనీస సదుపాయాలు కల్పించడంలో బీఆర్ఎస్ విఫలమైంది అని వ్యాఖ్యానించారు. నియోజక వర్గంలో డ్రైనేజ్ సమస్య, మంచినీటి సమస్యలు చాలా ఉన్నాయని అన్నారు.
15 శాతానికి పడిపోయిన బీఆర్ఎస్ ఓటు బ్యాంక్
గత అసెంబ్లీ ఎన్నికల్లో 35 శాతం ఓటు షేర్ ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు 15 శాతానికి పడిపోయింది అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బీజేపీకి ఓట్ షేర్ ఎందుకు షిఫ్ట్ అయిందా అని చర్చిస్తున్నామని చెప్పారు. తాను ఎప్పుడూ కూడా బీజేపీకి సపోర్ట్ చేయలేదని అన్నారు. ‘పార్లమెంట్ లో కేవలం 23 మంది ముస్లిం ఎంపీలు మాత్రమే ఉన్నారు. దేశంలో అన్ని కులాలకు ఒక్కో పార్టీ ఉంది. మరి ముస్లింల కోసం మాట్లాడడం తప్పా..?’ అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి చాలా యాక్టివ్‌గా పని చేస్తున్నారు..
‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. అభివృద్ధి చేద్దాం. కలిసి రావాలని కోరితే కలిసి పనిచేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి చాలా యాక్టివ్ గా పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి లాగా బీఆర్ఎస్ ఆలోచించలేదు. ఓల్డ్ సిటీకి మెట్రో బీఆర్ఎస్ హయాంలో చేయలేదు. కేటీఆర్ కు అవగాహన ఉన్నట్టు లేదు. అంతా అయిపోయాక దొంగ ఓట్లు అని చెప్పడం ఏంటి..? ఈ ఓట్లు అన్నీ పాతవే.. ఓటర్ లిస్ట్ వచ్చాక ఏం చేశారు..? ఎన్నికల్లో సెంటిమెంట్ వర్క్ అవుట్ కాదు.. అభివృద్ధి చేయకుండా.. సెంటిమెంట్ తో ఓట్లు అడగడం ఏంటి..?’ అని నిలదీశారు.
పోటీ చేయాలా..? వద్దా?: రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం..
ఎమ్ఐఎమ్ అంటే ఒక ముస్లింలకే పరిమితం కాదు. జూబ్లీహిల్స్ లో పోటీ చేయాలా..? వద్దా..? అని ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడతారు. జూబ్లీహిల్స్ బస్తీలు గత పది ఏళ్లలో పూర్తిగా వెనుకబడ్డాయని అన్నారు. పదేళ్ల పాటు కనీస సదుపాయాలు కల్పించడంలో బీఆర్ఎస్ విఫలమైంది అని ఆరోపణలు చేశారు. నియోజక వర్గంలో డ్రైనేజ్ సమస్య, మంచినీటి సమస్యలు చాలా ఉన్నాయని చెప్పారు.