E-Paper
Advertisement

జగిత్యాల జిల్లాలో ఓ రైతు అద్భుత ఆలోచన.. సన్నవడ్ల కొనుగోలులో సంచలనం!

జగిత్యాల జిల్లాలో ఓ రైతు అద్భుత ఆలోచన.. సన్నవడ్ల కొనుగోలులో సంచలనం!
Advertisement

Direct Paddy: జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన మహేందర్ అనే రైతు ఒక వినూత్నమైన ఆలోచనతో అందరి దృష్టిని ఆకర్షించారు. సాధారణంగా రైతులు పండించిన పంటను మార్కెట్‌లో తక్కువ ధరకే అమ్ముకుని నష్టపోతుంటే, మరోవైపు వినియోగదారులు మాత్రం బియ్యాన్ని భారీ ధరలకు కొంటున్నారు. ఈ గ్యాప్‌ని తగ్గించడానికి మహేందర్ ఒక సింపుల్ అండ్ ప్రాక్టికల్ ఐడియాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దళారుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ కస్టమర్లే రైతుల దగ్గరికి వచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు.

వినియోగదారులకు మేలే..

చూశారుగా ఈ రైతు ఆలోచన. బయట మార్కెట్‌లో 9వేల రూపాయలకు బియ్యం కొనేబదులు రైతు దగ్గర 2 క్వింటాళ్ల సన్నవడ్లు 6వేలకు తీసుకుని పట్టిస్తే నూక, పొట్టు పోనూ మనకు క్వింటాల్ 10 కిలోల వరకు బియ్యం వస్తాయి. ఈ లెక్కన మనకు 6 వేల రూపాయలకు క్వింటాల్ రైస్ పడినట్లేగా. అంతేకాదు. రైస్‌మిల్లులో బియ్యం ఉచితంగానే పట్టిస్తారు. ఇలా కొంత మంది కలిసి ఒక రైతు పండించిన పంట తీసుకుంటే.. రైతుకు మేలు. వినియోగదారులకు మేలే.

తక్కువ ధరకే సన్న బియ్యం..

Advertisement

ఇలా డైరెక్ట్ రైతుల దగ్గర కొనడం వల్ల వినియోగదారులకు నాణ్యమైన అసలైన సన్నబియ్యం తక్కువ ధరకే దొరుకుతాయి. రైతులకు కూడా తమ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. స్మార్ట్ థింకింగ్‌తో ముందుకెళ్తున్న ఈ జగిత్యాల రైతు ఐడియాను ఇప్పుడు అంతా అప్రీషియేట్ చేస్తున్నారు.

Also read: రాహుల్‌ను ప్రధానిని చేయలేదు..:! కేటీఆర్‌ను సీఎం చేస్తా..! కేసీఆర్‌కు కలిసిరాని కాలం! ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం..?

Tags

Related News

మూసీ సుందరీకరణ కాదు.. రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి స్కెచ్.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ధ్వజం!

ఆంధ్రప్రదేశ్‌కు అండగా.. తెలంగాణ విద్యుత్‌ సహాయక బృందాలు!

హుజురాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకం వివాదం.. కోర్టు ఉత్తర్వులున్న భూమిలో నిర్మాణం!

మియాపూర్ భూముల వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ విక్టరీ!

కొండా సురేఖ క్షమాపణపై కేటీఆర్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?

కెటిఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు.. ఉద్దేశపూర్వకంగా అనలేదని క్లారిటీ ఇచ్చిన సురేఖ!

జగిత్యాల శ్మశానవాటికలో క్షుద్రపూజల కలకలం.. బొమ్మకు సూదులు గుచ్చి..?

Big Stories

Advertisement
×