Mother Killed Daughter: చిన్న చిన్న ఘటనలు అన్నెం పుణం తెలియని చిన్నారులు ఈ లోకాన్ని విడిచి పెట్టేలా చేస్తున్నాయి. అది తల్లిదండ్రులు తప్పా? చిన్నారులు చేసినా శాపమా? అనేది తెలీదు. సెల్‌ఫోన్ అతిగా చూస్తుందన్న కారనంగా కూతుర్ని చంపేసింది కసాయి తల్లి. సంచలన రేపిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలక కేంద్రంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హనుమాన్ టెంపుల్ కాలనీలో నివాసం ఉంటున్నారు రాజు- విజయలక్ష్మి దంపతులు. ఈ జంటకు సువర్ణ అనే 14 ఏళ్ల కూతురు ఉంది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది ఆ యువతి. చదువులో ఎప్పుడు ఫస్ట్ ఉండే సువర్ణ, ఇంట్లో మొబైల్ ఫోన్ చీటికి మాటికి చూసేది. యువతి కల్లుకు బానిసైన తల్లి, కుమార్తెతో నిత్యం గొడవ పడేవాడు.
ఈనెల 27న మంగళవారం సాయంత్రం సెల్‌ఫోన్ పదే పదే చూస్తుందని తల్లి-కూతురు గొడవ పడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన తల్లి, కూతుర్ని గొంతు నులిమి చంపేసింది. ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పెద్ద స్కెచ్ వేసింది. బాలిక మెడకు చీర చుట్టి.. భర్తకు ఫోన్ చేసి ఇంటికి రప్పించింది విజయలక్ష్మి. తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సువర్ణ ఈ లోకాన్ని విడిచిపెట్టింది. ఇటీవలే చిన్నారి పుష్పవతి కావడంతో కడుపునొప్పి బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని భావించాడు కన్నతండ్రి.
ALSO READ: అతివేగం కొంప ముంచింది.. పల్టీలు కొట్టిన టయోటా ఇన్నోవా, రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులో భాగంగా సువర్ణ తల్లిపై పోలీసులకు అనుమానం వచ్చింది. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా ఈ కేసు హత్య కేసుగా మార్చారు పోలీసులు. దీంతో మరోసారి విజయలక్ష్మిని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయాలు వెల్లడయ్యాయి. ఫోన్ అతిగా మాట్లాడుతోందని, మాట వినట్లేదని భావించిన కూతుర్ని చంపినట్లు విచారణలో అంగీకరించింది కసాయి తల్లి. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు వివరించారు.