E-Paper
Advertisement

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి సంచలనం.. ఏమన్నారంటే?

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి సంచలనం.. ఏమన్నారంటే?
Advertisement

Invest Telangana: ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ క‌ర్టెన్ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కి సీఎం హృదయపూర్వకంగా స్వాగతం ప‌లికారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వాకాటి శ్రీహరి, మహ్మ‌ద్ అజారుద్దీన్, పారిశ్రామికవేత్త‌లకు, విధాన రూప‌క‌ర్త‌ల‌కు, అధికారులకు, మిత్రులందరికీ సీఎం పలకరించారు.

సుమారు 400 ఏళ్ల క్రితమే..

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌’కు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సుమారు 400 ఏళ్ల క్రితమే హైదరాబాద్ ఒక ప్రపంచస్థాయి నగరంగా వెలుగులీనిందని, ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌లోని చార్మినార్ పరిసరాలకు వచ్చి వ్యాపారాలు చేసేవారు. ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు, వెండి నకాషీ కళాకృతులను కొనుగోలు చేసేవారని సీఎం గుర్తు చేశారు. నిజాం పాలకులు అద్భుతమైన కట్టడాలు, ప్రపంచస్థాయి మ్యూజియం, టంక‌శాల (నాణేల ముద్రణాలయం), విమానాశ్రయం, రైల్వేలు, అత్యుత్తమ విద్యా సంస్థలతో హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేశారని అన్నారు.

ప్రపంచం గ‌ర్వించే మేధో నిపుణులు..

Advertisement

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ ప్రపంచం గ‌ర్వించే మేధో నిపుణులు, నాయ‌కుల‌ను అందించింది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ప్రేమ్ వత్స వంటి ప్రముఖులంతా హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. విదేశీ పెట్టుబ‌డులను ఆకర్షించడం, అంతర్జాతీయ స్థాయి ప్రతిభావంతులను తయారు చేయడంలో హైదరాబాద్‌కు ప్రత్యేకత ఉందని సీఎం అన్నారు. భారత దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో, దేశ ఆర్థిక ప్రగతికి బాటలు వేసిన మహా నేతలను మ‌నం స్మరించుకోవాలని అన్నారు.

రాజీవ్ గాంధీ..

ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల సమక్షంలో నిలబడి, దేశ ప్రగతికి బాటలు వేసిన ఆ మహానేతలకు నేను సెల్యూట్ చేస్తున్నాను. అతి పిన్న వయసులో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ల రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. నేడు ఫోన్‌, ఇంటర్నెట్‌ లేని జీవితాన్ని మనం ఊహించలేమని రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ హైదరాబాద్‌లో పైలట్ శిక్షణ పొందారు. పైలట్‌గా కూడా పనిచేశారు. అందుకే హైదరాబాద్‌లోని ప్రపంచస్థాయి విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టుకున్నామని అన్నారు. 1991లో శ్రీ పీవీ నరసింహారావు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తెలంగాణ‌కు చెందినవారు. ఆ సమయంలో భారత్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ఆయన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్‌పీజీ) సంస్కరణలను అమలు చేశారు.

Advertisement

Also read: ఏపీ వైపు దూసుకొస్తున్న మరో వాయుగండం.. తెలంగాణలో భారీ వర్షాలు!

నాది భద్రత..

హైదరాబాద్ జీవ‌నంలోనే ప్రపంచస్థాయి దృక్పథం ఉంది. సంస్కరణలను స్వీకరించే తత్వం, పారిశ్రామిక స్ఫూర్తి ఉన్నాయి. 1991 నుంచి హైదరాబాద్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రభుత్వాలు అధికారంలోకి ఉన్నాయి. రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, హైదరాబాద్ పెట్టుబడుల ప్రస్థానానికి అంతా మద్దతుగా నిలిచారు. నేను ఇక్కడ సుదీర్ఘంగా ప్రసంగించ‌డానికి రాలేదు. పెట్టుబడిదారుల అభిప్రాయాలను వినడానికి వచ్చాను. వ్యాపార రంగం గురించి మాకంటే మీకే ఎక్కువ అవగాహన ఉంది. మీ నుంచి నేర్చుకుంటాం, మీ అభిప్రాయాలను అర్థం చేసుకుంటాం, వాటిని ఆచరణలో పెడతామని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. తెలంగాణలో మీరు పెట్టే పెట్టుబడులకు భద్రత కల్పించడం, అవి వృద్ధి చెందేలా చూడడం నా వ్యక్తిగత బాధ్యత. మీ పెట్టుబడులకు సంరక్షకుడిగా ఉంటానని సీఎం రేవంత్ తెలిపారు.

తెలంగాణ రైజింగ్ 2047..

ముందుగా మీకో విజ్ఞప్తి చేస్తున్నా. మీరు తెలంగాణలో ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ముందుగా మీ మనసులో ఒక సంఖ్యను నిర్ణయించుకోండి. ఆ మొత్తాన్ని ఇప్పుడు రెట్టింపు చేయండి! మీరు ఆశిస్తున్న వృద్ధి అంచనాలను రెట్టింపు చేయండి. మీరు ఆశిస్తున్న లాభాలనూ రెట్టింపు చేయండి. మీకు నా నుంచి ఏం కావాలో చెప్పండి. విధానపరమైన నిర్ణయాలైనా, ప్రభుత్వ సహకారమైనా, మీకు అవసరమైన మద్దతు అందించే బాధ్యతను నేను తీసుకుంటానని సీఎం అన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ తెలంగాణ భవిష్యత్ ప్రణాళిక. ఇది ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి అనుగుణంగా ఉంది. 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే, అందులో తెలంగాణ వాటా 10 శాతంగా ఉండాలి. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉందని గుర్తు చేశారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం అని సీఎం రేవంత్ అన్నారు.

హైస్పీడ్ రైలు..

పెట్టుబడిదారుల్లో చాలామందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మ‌ధ్య‌న సంబంధాలపై సందేహాలున్నాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇప్పుడే చెప్పారు. అభివృద్ధి విషయంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మధ్య సంబంధాలు ఏమిటనేది కేంద్ర మంత్రి చెప్పారు. దేశంలో ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో మూడు హైదరాబాద్‌కు అనుసంధానం కానున్నాయి. హైదరాబాద్‌–చెన్నై, హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–పుణె మార్గాల్లో ఈ కారిడార్లు ఏర్పాటుకానున్నాయి. వరంగల్‌, ఆదిలాబాద్‌లలో రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరిస్తోంది. రీజినల్ రింగ్ రోడ్డు నుంచి మెట్రో రైలు విస్తరణ వరకు, నేవీ రాడార్ కేంద్రం నుంచి అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాల వరకు కేంద్రం నుంచి సహకారం పొందుతున్నామని అన్నారు.

ప్రపంచ నగరాలతో..

అభివృద్ధి విష‌యంలో ప్రభుత్వ జోక్యం కంటే, అవసరమైన చోట ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి అవకాశాలను విస్తరించాలి. మీ విజయపథంలో ఉన్న అడ్డంకులను తొలగించడమే నా పని. హైదరాబాద్ ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు నగరాలతో పోటీ ప‌డ‌దు. న్యూయార్క్‌, లండన్‌, టోక్యో, సియోల్‌, దుబాయ్‌ వంటి ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి మీ అత్యుత్తమ ఆలోచనలను అందించండి. మంచి విధానపరమైన సూచనలు చేయండి. మీ సూచనలను పరిశీలించి, వాటిని ప్రభుత్వ విధానాలుగా అమలు చేస్తామని అన్నారు. చివర‌గా తెలంగాణ ఎదుగుతోంది. ఈ ప్రగతి ప్రస్థానంలో మీరూ భాగస్వాములు కండి. మనమంతా కలిసి ఎదుగుతూ చరిత్ర సృష్టిద్దాం అని సీఎం అన్నారు.

Also read: ఇళయరాజా, భారతీరాజా మధ్య గొడవకు కారణం అదేనా?

Tags

Related News

మూసీ సుందరీకరణ కాదు.. రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి స్కెచ్.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ధ్వజం!

ఆంధ్రప్రదేశ్‌కు అండగా.. తెలంగాణ విద్యుత్‌ సహాయక బృందాలు!

హుజురాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకం వివాదం.. కోర్టు ఉత్తర్వులున్న భూమిలో నిర్మాణం!

జగిత్యాల జిల్లాలో ఓ రైతు అద్భుత ఆలోచన.. సన్నవడ్ల కొనుగోలులో సంచలనం!

మియాపూర్ భూముల వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ విక్టరీ!

కొండా సురేఖ క్షమాపణపై కేటీఆర్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?

కెటిఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు.. ఉద్దేశపూర్వకంగా అనలేదని క్లారిటీ ఇచ్చిన సురేఖ!

Big Stories

Advertisement
×