BigTV English

TPCC Chief Mahesh Goud : కేటీఆర్ ట్వీట్ పై టీపీసీసీ చీఫ్ ఫైర్

TPCC Chief Mahesh Goud : కేటీఆర్ ట్వీట్ పై టీపీసీసీ చీఫ్ ఫైర్

TPCC Chief Mahesh Goud : తప్పొప్పులు కప్పిపుచ్చుకోవడానికే విమర్శలు అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తమ అధికారం కోల్పోయిందనే బాధలో తాము చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ సంయమనం కోల్పోయి విమర్శలు చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని విమర్శిస్తున్న కేటీఆర్ ఏ అంశాలలో తగ్గిపోయిందో చెప్పాలని అన్నారు. గతంలో వారి ప్రభుత్వమే రూ.8 లక్షల కోట్లు అప్పు చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వారు చేసిన అప్పులకు 60 శాతం వడ్డీ కట్టడానికే సరిపోతోందని అన్నారు. ఇష్టారీతిలో బీఆర్ఎస్ తెచ్చిన అప్పుల భారం ప్రజలపై పడిందని అన్నారు.


కాళేశ్వరం ప్రాజెక్టు పై అనవసరంగా రూ.1.20 వేల కోట్లు ఖర్చుచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని మహేష్ గౌడ్ తెలిపారు. అనవసర ఖర్చులు బాగా పెంచేసి అడిగేవారు లేరన్నట్లుగా నాటి బీఆర్ఎస్ నేతలు వ్యవహరించారని అన్నారు. కేవలం కమిషన్లు వస్తున్నాయని భారీ ప్రాజెక్టులు చేపట్టారని అన్నారు.

ప్రస్తుతం రేవంత్ పాలన ప్రజాస్వామ్యబద్ధంగా, నిజాయితీగా, ప్రజారంజకంగా సాగుతోందని అన్నారు. హైడ్రా కూల్చివేతలపై నానా హంగామా చేస్తున్న మీరు మీ ఎమ్మెల్యేలు కబ్జా చేశారని వారిపై విమర్శలు చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి పల్లం రాజు కాంగ్రెస్ నేత కట్టడాలనే కూల్చివేయడం జరిగిందని అన్నారు. తప్పు జరిగితే ఎవరైనా కాంగ్రెస్ దృష్టిలో ఒకటే అన్నారు. హైడ్రాకు నీ.. నా బేధాలు ఉండవని.. అక్రమంగా ఎవరు కట్టుకున్నా.. వాటికి అనుమతులు లేకున్నా కూల్చేయడమే మా ఎజెండా అన్నారు.


ALSO READ :  రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై ధరణి నై.. ‘భూమాత’కి జై

కేసీఆర్ కుటుంబమే బాగుపడింది

దీని వల్ల కేసీఆర్ కుటుంబం తప్ప తెలంగాణలో ఏ కుటుంబం బాగుపడలేదన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన జరుగుతుంది. హైడ్రాకి తన, మన భేదాలు ఉండవని.. ఎవరి కట్టడాలు అక్రమంగా ఉన్న కూల్చివేయడమే ప్రధాన ఎజెండా అని స్ప‌ష్టం చేశారు. కేంద్ర మంత్రికి చెందిన ఇంటినే కూల్చేశారని అన్నారు.

హత్యా రాజకీయాలపై స్పందన

జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్యను ఈ సందర్భంగా ఖండిస్తున్నానని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదని అన్నారు. ఎవరు హత్యలకు పాల్పడ్డా అది ప్రజాస్వామ్యంలో మంచిది కాదని అన్నారు. దోషులు ఎవరైనా శిక్షలు అనుభవించాల్సిందే. వారికి శిక్ష పడేలా చూస్తానని అన్నారు. హత్యా రాజకీయాలను తెలంగాణ ప్రభుత్వం ఉపేక్షించబోదని అన్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×