BigTV English

Ram Charan: రామ్ చరణ్ కొత్త కార్.. నేమ్ ప్లేట్ నంబర్ వెనుక ఇంత కథ ఉందా..?

Ram Charan: రామ్ చరణ్ కొత్త కార్.. నేమ్ ప్లేట్ నంబర్ వెనుక ఇంత కథ ఉందా..?

Ram Charan.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని, రాజమౌళి(Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR ) సినిమాతో ఏకంగా గ్లోబల్ స్థాయి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు రామ్ చరణ్ (Ram Charan). మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన అనతి కాలంలోనే ఈ రేంజ్ లో స్టేటస్ ని సొంతం చేసుకోవడం అంటే అతిశయోక్తి కాదు. ఈ స్టేజ్ కి రావడానికి రామ్ చరణ్ ఎంత కష్టపడ్డారో.. ఎన్ని అవమానాలు భరించారో అందరికీ తెలిసిన విషయమే. రామ్ చరణ్ కష్టానికి ఇటీవలే గౌరవ డాక్టరేట్ లభించగా.. ఇప్పుడు సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో క్వీన్ ఎలిజిబెత్ తర్వాత ఆ రేంజ్ లో గౌరవాన్ని అందుకోబోతున్నారు. ముఖ్యంగా ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన పెట్ డాగ్ రైమ్ కి కూడా ఈ అరుదైన గౌరవాన్ని అందించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


కొత్త కార్ రిజిస్ట్రేషన్ పూర్తి..

ఇదిలా ఉండగా రామ్ చరణ్ కి ఖరీదైన కార్లు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా చిరంజీవికి కూడా లగ్జరీ కార్లు అంటే ఎనలేని ప్రీతి. ఈ నేపథ్యంలోనే తన తండ్రి చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా కాస్ట్లీ కార్ ను బహుమతిగా ఇచ్చారు రామ్ చరణ్. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఒక కొత్త రోల్స్ రాయ్స్ కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కార్ కి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి నేమ్ ప్లేట్ కూడా పొందినట్లు సమాచారం. ఇప్పుడు ఈ కార్ నంబర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.అంతేకాదు ఈ నేమ్ ప్లేట్ వెనుక ఉన్న నంబర్స్ ప్రత్యేకత ఏంటో కూడా హల్చల్ చేస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం రామ్ చరణ్ తన కొత్త రోల్స్ రాయిస్ కి నెంబర్ TG 09C 2727 పేరిట రిజిస్టర్ చేయించుకున్నారు.


నేమ్ ప్లేట్ వెనుక అసలు కథ ఇదే..

ఈ నేపథ్యంలోనే ఈ నెంబర్ మళ్లీ వైరల్ గా మారింది. ఇక ఈ నేమ్ ప్లేట్ వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27 కాబట్టి అది తన లక్కీ డే గా మార్చుకున్న ఆయన తన కారు నంబర్ ప్లేట్లో కూడా 27 వచ్చేలా చూసుకున్నాడని తెలుస్తోంది. అంతేకాదు రామ్ చరణ్ దగ్గర ఉన్న మిగతా కార్లు కూడా 27 అనే నంబర్ తోనే ముడిపడి ఉన్నాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా రామ్ చరణ్ కి తన పుట్టిన రోజు లక్కీ రోజు కాబట్టే ఆ నంబరు వచ్చేలా తన కార్ లకి కూడా అదే నెంబర్ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

రామ్ చరణ్ సినిమాలు..

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్లో విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వచ్చే యేడాది సంక్రాంతికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అలా జనవరి 10వ తేదీ నుంచి తన తండ్రి చిరంజీవి విశ్వంభర సినిమాను తప్పించడంతో ఆ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు రామ్ చరణ్. ఇప్పుడు సంక్రాంతి బరిలో పోటీకి దిగనున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×