BigTV English

Sajjanar: ఫుట్ బోర్డుపై విద్యార్థుల ప్రయాణం..అసలేం జరిగింది?

Sajjanar: ఫుట్ బోర్డుపై విద్యార్థుల ప్రయాణం..అసలేం జరిగింది?
  •  ఆర్టీసీ ఎంసీ సజ్జనార్ ఆగ్రహం
  • ఎంక్వైరీ చేయాలని అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్, స్వేచ్ఛ: షాద్ నగర్ విద్యార్థులు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు లేఖ రాశారు. ఫుడ్ బోర్డు మీద వేలాడుతున్న తమకు భరోసా కల్పించేదెవరని ఆవేదన వ్యక్తం చేశారు. షాద్ నగర్ – ఆమన్ గల్ రూట్‌లో బస్సులు సరిపోక ఇబ్బందులు పడుతున్నామని సజ్జనార్‌కు లేఖలో వివరించారు విద్యార్థులు గతంలో 10 బస్సులు నడిస్తే ఇప్పుడు 4 బస్సులే నడుపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రూట్‌లో బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. డిగ్రీ కాలేజీలు దూరంగా ఉండడంతో ఆర్టీసీ 35 కిలోమీటర్ల బస్ పాస్ పరిమితి సరిపోవట్లేదని లేఖలో వివరించారు. డిగ్రీ, హైయర్ ఎడ్యుకేషన్ చేసే వారి కోసం 45, 60 కిలోమీటర్ల వరకు బస్ పాస్ పరిమితి పెంచాలని కోరారు. షాద్ నగర్ – మహబూబ్ నగర్ రూట్‌లో పల్లె వెలుగు బస్సులు నడపాలని సజ్జనార్‌ను కోరారు.


స్పందించిన సజ్జనార్

షాద్ నగర్ విద్యార్థుల సమస్యల మీద ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న మీడియా కథనాలపై రియాక్ట్ అయిన ఆయన, ఈ సమస్య మీద ఎంక్వైరీ చేయాలని అధికారులను ఆదేశించారు.


కాసుల పంట
హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణ ఆర్టీసీకి కాసుల పంట పండింది. బతుకమ్మ, దసరా పండుగల్లో కోట్ల ఆదాయం వచ్చింది. పండుగల సందర్భంగా పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు జనం. అక్టోబర్ 1 నుండి 15 తేదీ వరకు 707.73 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. దీనివల్ల రూ.307.16 కోట్ల ఆదాయం వచ్చింది. రెగ్యులర్‌గా తిరిగే సాధారణ సర్వీసులు కాకుండా 10,513 ఎగస్ట్రా బస్సులు నడిపారు. ఈ ఏడాది మహాలక్ష్మి ఉచిత బస్సు సర్వీస్ కూడా మహిళలలకు ఉండటంతో బాగా కలిసి వచ్చింది అంటున్నారు అధికారులు.

Related News

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Bathukamma: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

Karimnagar Fire Accident: కరీంనగర్‌లోని రీసైక్లింగ్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Telangana: ఎమ్మెల్సీ తాతా మధుపై ఖమ్మం జిల్లా నేతల తిరుగుబాటు!

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

Big Stories

×