E-Paper
Advertisement

బర్త్ డే సెలబ్రేషన్స్ ఇలా కూడా చేస్తారా..? నడి రోడ్డుపై పెట్రోల్ పోసి.. వీడియో మస్త్ వైరల్

బర్త్ డే సెలబ్రేషన్స్ ఇలా కూడా చేస్తారా..? నడి రోడ్డుపై పెట్రోల్ పోసి.. వీడియో మస్త్ వైరల్
Advertisement

Mumbai: ముంబైలో ఒక వ్యక్తి తన పుట్టినరోజు వేడుకల కోసం చేసిన అత్యుత్సాహం ఇప్పుడు పోలీసు కేసు వరకు వెళ్లింది. ముంబైలోని గోరేగావ్ వెస్ట్, రామ్ మందిర్ రోడ్డులో ఉన్న సోమాని గ్రామ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఫహద్ షేక్ అనే వ్యక్తి తన 33వ పుట్టినరోజును పురస్కరించుకుని, రోడ్డుపై పెట్రోల్‌తో ’33’ అనే అంకెను రాసి దానికి నిప్పు పెట్టాడు. సన్‌టెక్ సిటీ (4వ ఎవెన్యూ) రెసిడెన్షియల్ కాంప్లెక్స్ బయటే ఈ ప్రమాదకరమైన పనికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు.

రోడ్డుకు నష్టం.. స్థానికుల ఆగ్రహం

Advertisement

ఈ విన్యాసం వల్ల ఎంఎంఆర్‌డీఏ (MMRDA) రోడ్డు నాలుగు చోట్ల దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. జనం రాకపోకలు సాగించే బహిరంగ ప్రదేశంలో ఇలా నిప్పుతో ఆటలాడటం పట్ల స్థానిక నివాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఫహద్ షేక్ జోగేశ్వరి వెస్ట్ ప్రాంతానికి చెందిన ఒక కార్ డీలర్ అని తెలుస్తోంది.

రంగంలోకి దిగిన పోలీసులు

Advertisement

ఈ వీడియో వైరల్ కావడంతో ముంబై పోలీసులు తక్షణమే స్పందించారు. ప్రస్తుతం వారు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? వీడియోలో ఉన్న వ్యక్తి నిజంగా ఫహద్ షేకేనా? అనే విషయాలను నిర్ధారించుకునే పనిలో ఉన్నారు. రోడ్డుకు జరిగిన నష్టాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Also Read:పోలీసులకే సవాల్.. అందరూ చూస్తుండగానే బ్యాంకును ఊడ్చేశారు!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×