E-Paper
Advertisement

Revanth Reddy : కొండంగల్‌లో రేవంత్ నామినేషన్.. భారీగా తరలివచ్చిన అభిమానులు..

Revanth Reddy : కొండంగల్‌లో రేవంత్ నామినేషన్.. భారీగా తరలివచ్చిన అభిమానులు..
Advertisement

Revanth Reddy : తెలంగాణ ఎన్నికల్లో భాగంగా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీపిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.

అంతకుముందు రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో కొడంగల్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ ఇంటికి ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్బంగా రేవంత్ తన మనవడితో ప్రజలకు అభివాదం చేశారు.

Advertisement

అక్కడినుండి గడిబావి శివాలయంకు చేరుకుని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ దాఖలు చెయ్యడానికి రేవంత్ భారీ ర్యాలీతో ఆర్వో కార్యాలయానికి చేరుకోనున్నారు.

నామినేషన్ దాఖలు చేసే ముందు రేవంత్ రెడ్డి కొడంగల్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. కొడంగల్‌లో తాడోపేడో తేల్చుకోడానికి కేసీఆర్ రావాలని సవాల్ విసిరారు. ఈ ఎన్నికలు కొడంగల్ ప్రజలకు కేసీఆర్ మధ్యే అని తెలిపారు.

Advertisement

కృష్ణాజలాలు తెచ్చి ఈ ప్రాంతం కాళ్ళు కడుగుతానని కేసీఆర్ మాటతప్పారని ఆయన అన్నారు. కొడంగల్ బిడ్డను నేను.. 119 నియోజగకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయమని నన్ను పంపించారని రేవంత్ రెడ్డి అన్నారు.

రాజకీయాలలోకి ప్రవేశించినప్పటి నుండి రేవంత్ ఎప్పుడు ఒక గుడిలో పూజలు నిర్వహించి నామినేషన్ దాఖలు చేస్తారు. అదే వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి. ఇక్కడకూడా పూజలు నిర్వహించి రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చెయ్యడానికి బయలుదేరారు.

అయితే రేవంత్ రెడ్డి ఈసారి జరుగబోయే ఎన్నకలలో కొడంగల్‌తోపాటు కామారెడ్డి నుంచి పోటీ చేయనున్నారు. కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్నికల బరిలో ఉన్నారు.

రేవంత్ రెడ్డి కామారెడ్డిలో రేపు ఎన్నికల నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×