BigTV English

RaviTeja EAGLE Teaser : మాస్ మహారాజ్ సంక్రాంతికి సై.. టీజర్ అదుర్స్.. 

RaviTeja EAGLE Teaser : మాస్ మహారాజ్  సంక్రాంతికి సై..  టీజర్ అదుర్స్.. 
RaviTeja EAGLE Teaser

RaviTeja EAGLE Teaser : మాస్ మహారాజు రవితేజ దసరా బరిలో టైగర్ నాగేశ్వరరావు అంటూ ఆడియన్స్ ను పలకరించాడు. భారీ అంచనాల మధ్య దసరాకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. దీంతో రాబోయే నెక్స్ట్ మూవీ పై మాస్ మహారాజ్ అభిమానులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు విడుదలైన రవితేజ మోస్ట్ అవైటెడ్ ఈగల్’ టీజర్ ఎలా ఉందో తెలుసుకుందాం..


ఇప్పటికే ఈగల్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సంక్రాంతి బరిలో ఈగల్ ఉండదు అని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటన్నింటినీ తోసి పుచ్చుతూ సంక్రాంతి పోరుకి ఈగల్ సై అని మేకర్స్ అనౌన్స్ చేయడంతో పాటు ఈరోజు టీజర్ ని కూడా విడుదల చేశారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో రవితేజ చేస్తున్న ఈగల్ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇక ఈ మూవీ నుంచి ఈరోజు విడుదలైన టీజర్ విషయానికి వస్తే చిన్న ఈలపాటతో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటే.. చెల్లాచెదురుగా పడిన మనుషులు.. మధ్యలో అక్కడక్కడ మంటలు.. పాడుబడిన గోడలు.. ఇలాంటి దృశ్యాలను స్టార్టింగ్ లో చూపిస్తారు. ఇక వెనుక రవితేజ బేస్ వాయిస్ లో.. “కొండలో లావాను కిందకు పిలవకు..ఊరు ఉండదు.. నీ ఉనికి ఉండదు..”అంటూ ఒక మాస్ పంచ్ డైలాగ్ తో టీజర్ మొదలుపెట్టారు. ఇలా పవర్ ఫుల్ డైలాగ్స్ తో అదరగొట్టారు.


ఈ టీజర్ మొత్తానికి రవితేజాని బాగా ఎలివేట్ చేశారు. ఈగల్ విజన్ కి గుర్తు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ స్టార్టింగ్ రవితేజ కళ్ళ వరకు హైలైట్ చేస్తారు. ఇక అవసరాల శ్రీనివాస్, అనుపమకు రవితేజ గురించి ‘అడవిలో ఉంటాడు.. నీడై తిరుగుతుంటాడు.. కనిపించడు కానీ వ్యాపించి ఉంటాడు..’ అని చెప్పే సీన్ మూవీపై ఆసక్తి పెంచేలా ఉంది. పాతకాలం విలన్ టైప్ లో లుంగీ కట్టి తుపాకీ పట్టుకొని రవితేజ ఊర మాస్ గా కనిపించాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తుండగా నవదీప్ , అవసరాల శ్రీనివాస్, మధుబాల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈగల్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ కానుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×