BigTV English

Kamal Haasan Movies Update: కమల్ హాసన్ క్రేజీ అప్డేట్.. ఆ రెండు చిత్రాల షూటింగ్స్ కంప్లీట్.. ఇక మొదలెడదామా అంటున్న ఫ్యాన్స్!

Kamal Haasan Movies Update: కమల్ హాసన్ క్రేజీ అప్డేట్.. ఆ రెండు చిత్రాల షూటింగ్స్ కంప్లీట్.. ఇక మొదలెడదామా అంటున్న ఫ్యాన్స్!
Kamal Haasan movies
Kamal Haasan

Update on Kamal Haasan Upcoming Movies: విలక్షణ నటుడు కమల్ హాసన్ గతేడాది విక్రమ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అప్పటి వరకు వరుస ఫ్లాపులతో సతమతమయిన కమల్ ఒక్కసారిగా విక్రమ్ చిత్రంతో ఫామ్‌లోకి వచ్చాడు. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సైతం ఈ మూవీ అందుకుంది. అదే ఫాంలో ఇప్పుడు మరికొన్ని చిత్రాలతో కమల్ బిజీ బిజీ అయిపోయాడు.


ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. అందులో ‘భారతీయుడు 2’ మూవీ ఒకటి. 27 ఏడేళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భారతీయుడు’ మూవీకి సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతోంది. ఈ మూవీలో హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది. అలాగే యంగ్ హీరో సిద్ధార్థ్‌తో పాటు ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా భ‌వానీ శంక‌ర్ ఈ మూవీలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

కాగా ఈ సినిమా షూటింగ్‌ను మొదలెట్టి ఎంతో కాలమైంది. అయినా.. కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఇటీవల ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఈ మూవీ యూనిట్ ఉంది. ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


Also Read: ఈ వారం థియేటర్/ ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీలు.. సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదే

ఇకపోతే ఈ మూవీకి మరో పార్ట్ కూడా ఉందని.. ఇండియన్ 3గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలకు తాజాగా హీరో కమల్ హాసన్ చెక్ పెట్టాడు. ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్.. రాజకీయ అంశాలతో పాటు సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నాడు.

కమల్ హాసన్ తన సినిమాల గురించి మాట్లాడుతూ.. ఇప్పటికే ఇండియన్ 2 మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీంతోపాటు ఇండియన్ 3 మూవీ షూటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి అంటూ అదిరిపోయే అప్డేట్‌ను అందించారు.

అలాగే ‘కల్కి 2898ఏడీ’ మూవీలో ఓ గెస్ట్ పాత్రలో చేస్తున్నానని తెలిపాడు. దీంతోపాటు తాను నటిస్తున్న మరో మూవీ ‘థగ్ లైఫ్’ షూటింగ్ ఎన్నికల తర్వాత స్టార్ట్ అవుతుందని తెలిపాడు. దీంతో కమల్ హాసన్ అందించిన అప్డేట్‌తో సినీ ప్రియుల్లో ఫుల్ ఖుష్ మొదలైంది.

Also Read: లోక్‌సభ ఎంపీ సీటుపై కంగనా రియాక్షన్.. ఇకపై ఆ విధంగా పని చేస్తాను

ఇండియన్ 2తో పాటు ఇండియన్ 3 కూడా కంప్లీట్ అయిందని చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇండియన్ 2 మూవీ ఎలక్షన్స్ తర్వాత అంటే ఆగస్టులో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక ఇండియన్ 3 మూవీ మాత్రం వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×