BigTV English

TRS Celebrations : టీఆర్ఎస్ సంబరాలు షురూ.. కారుదే జోరు..

TRS Celebrations : టీఆర్ఎస్ సంబరాలు షురూ.. కారుదే జోరు..

TRS Celebrations : 10 రౌండ్లు ముగియగానే గులాబీ శ్రేణులు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేశాయి. కారు పార్టీదే గెలుపంటూ తెలంగాణ భవన్ ముందు టపాసులు పేల్చేశాయి. స్వీట్లు పంచుతూ.. తీన్మార్ డ్యాన్సులు చేస్తూ.. కార్యకర్తలు జోరు మీదున్నారు.


మునుగోడు కౌంటింగ్ మొదట్లో తీవ్ర ఉత్కంఠను రేపింది. మొదటి రౌండ్ లో అధికార పార్టీదే హవా నడిచినా.. రెండు, మూడు రౌండ్లలో కారు స్పీడుకు బ్రేకులు పడ్డాయి. బీజేపీ దూసుకొచ్చింది. టీఆర్ఎస్ శ్రేణుల్లో హైరానా మొదలైంది. కౌంటింగ్ నిదానంగా జరగడం.. బీజేపీకే ఎడ్జ్ అంటూ ఉదయం వార్తలు రావడంతో కారులో కంగారు పెరిగింది. అయితే, రౌండ్లు మారుతున్నా కొద్దీ.. ఆధిక్యం పెరుగుతూ వచ్చింది. నాలుగో రౌండ్ నుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదు టీఆర్ఎస్.

రౌండ్ రౌండ్ కీ మెజార్టీ వస్తుండటం.. 11 రౌండ్లు ముగిసే సరికి 5 వేల ఆధిక్యం రావడంతో.. ఇక విజయం కన్పామ్ అని తేల్చేశారు. తెలంగాణ భవన్ కు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. ఫ్లెక్సీలు, బ్యాండ్ మేళాలు, బాంబులు, మిఠాయిలతో ధూంధాంగా సంబరాలు చేస్తున్నాయి. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.


Related News

BJP Leaders Fights: డీకే అరుణ Vs శాంతి కుమార్.. పాలమూరు బీజేపీలో పంచాయితీ

TG Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం.. కేసీఆర్ మైండ్ గేమ్

Tirupati TDP: తిరుపతిలో టీడీపీకి దిక్కెవరు?

India-China Thaw: భారత్‌‌‌‌తో చైనా దోస్తీకి సై.. రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది?

Giddalur Politics: గిద్దలూరు వైసీపీలో అయోమయం.. నాగార్జున ఫ్యూచర్ ఏంటి?

Pakistan Army: పాక్ పరేషాన్ ఫోర్స్..! చైనా సపోర్ట్‌‌తో మునీర్ కొత్త ప్లాన్..?

Big Stories

×