E-Paper
Advertisement

New Records in T20 : బాబోయ్.. రికార్డులు బద్దలయ్యేలా బాదేస్తున్నాడు..

New Records in T20 : బాబోయ్.. రికార్డులు బద్దలయ్యేలా బాదేస్తున్నాడు..
Advertisement

New Records in T20 : ప్రత్యర్థి ఎవరైనా.. బౌలర్ ఎంతటి మొనగాడైనా… తనకు లెక్కేలేదన్నట్లు బాదేస్తున్న టీమిండియా T20 స్పెషలిస్ట్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్… ఒక్క మ్యాచ్ లోనే మూడు రికార్డులు సృష్టించాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి… సూర్య అందుకున్న ఆ రికార్డులేంటో చూద్దాం…

ఒక T20 వరల్డ్‌కప్‌లో 100 కంటే ఎక్కువ బంతులు ఆడి… హయ్యెస్ట్ స్ట్రైక్‌రేట్‌ ఉన్న బ్యాటర్ల జాబితాలో… సూర్యకుమార్‌ నెంబర్ వన్ ప్లేస్ కు చేరుకున్నాడు. ప్రస్తుత T20 వరల్డ్ కప్ లో సూర్యకుమార్‌ స్ట్రైక్ రేట్ 193.96. ఏ T20 వరల్డ్ కప్ లోనూ, మరే బ్యాటర్ కూ ఈ రేంజ్ లో స్ట్రైక్‌రేట్‌ లేదు. 2010 T20 వరల్డ్ కప్ లో మైక్ హస్సీ పేరిట ఉన్న 175.7 స్ట్రైక్‌రేటే ఇప్పటిదాకా ఉన్న హయ్యెస్ట్ స్ట్రైక్‌రేట్. ఇప్పుడు ఆ రికార్డును సూర్య బద్దలు కొట్టాడు. సూర్య, హస్సీల తర్వాత… హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ రికార్డ్ లూక్ రైట్ పేరు మీద ఉంది. 2012 T20 వరల్డ్ కప్ లో లూక్‌ రైట్‌ కు 169.29 స్ట్రైక్‌రేట్‌ ఉంది. 2022 T20 వరల్డ్ కప్ లో గ్లెన్‌ ఫిలిప్స్‌ 163.86 స్ట్రైక్‌రేట్‌తో నిలవగా… 2007 T20 వరల్డ్ కప్ లో కెవిన్‌ పీటర్సన్‌కు 161.81 స్ట్రైక్‌రేట్‌ ఉంది.

Advertisement

ఇక T20 వరల్డ్‌కప్‌లో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన టీమిండియా బ్యాటర్లలో సూర్య నాలుగో స్థానంలో నిలిచాడు. తొలి, మూడు స్థానాల్లో యువరాజ్ సింగ్ ఉండగా… రెండోస్థానంలో కె.ఎల్.రాహుల్ ఉన్నాడు. 2007 T20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లోనే యువరాజ్ హాఫ్ సెంచరీ చేయగా… 2021 T20 వరల్డ్ కప్ లో స్కాట్లాండ్‌పై కె.ఎల్‌.రాహుల్‌ మ్యాచ్‌లో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇక 2007 T20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై యువరాజ్ సింగ్ 20 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టాడు.

మరోవైపు… T20 మ్యాచ్ ల్లో భారత్ తరఫున చివరి 5 ఓవర్లు ఆడి ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సూర్యకుమార్‌ మూడో స్థానానికి వచ్చేశాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఐదు ఓవర్లు బ్యాటింగ్ చేసిన సూర్య… 56 రన్స్ కొట్టాడు. ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ లో ఆప్ఘనిస్తాన్ పై చివరి 5 ఓవర్లు ఆడిన కోహ్లీ… 63 రన్స్ చేసి తొలిస్థానంలో ఉండగా… 2007 T20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్‌పై యువరాజ్‌ సింగ్‌ చివరి 5 ఓర్లలో 58 రన్స్ చేసి రెండో స్థానంలో ఉన్నాడు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×