Big Stories

NEWS: ఫటాఫట్ చోటాన్యూస్.. ఏపీ, తెలంగాణ రౌండప్..

NEWS: అనర్హత వేటుపై తొలిసారి స్పందించారు రాహుల్ గాంధీ. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని దుయ్యబట్టారు. అదానీ షెల్ కంపెనీల్లోకి 20వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అనర్హత వేటు వేసినా.. జైలుకు పంపినా వెనక్కి తగ్గనన్నారు రాహుల్.

- Advertisement -

రాహుల్‌ గాంధీ అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో తల్లీకొడుకులు ఇద్దరూ నిందితులుగా ఉన్నారని గుర్తుచేశారు. ఈ స్కామ్‌లో 5 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

- Advertisement -

రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగ ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధమని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ విమర్శించారు. హత్యాయత్నం కేసులో దోషిగా తేలిన తర్వాత లక్షద్వీప్‌కు చెందిన ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌పై అనర్హత వేటు పడటాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఫైజల్‌ శిక్షను కేరళ హైకోర్టు సస్పెండ్ చేసిందని గుర్తుచేశారు.

రాహుల్ గాంధీపై అనర్హత వేటును తెలంగాణ కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంది. రాహుల్ కి మద్దతుగా పదవులకు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. గాంధీభవన్‌లో జరిగే ముఖ్యనేతల సమావేశంలో రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

పేపర్ లీక్‌తో నష్టపోయిన నిరుద్యోగులందరికి లక్ష రూపాయల భృతి ఇవ్వాలని బీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేసారు. ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్న బండి.. పేపర్ లీక్ కేసులో విచారణ జాప్యం చేస్తూ నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు.

మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని .. లేకపోతే భర్తరఫ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణకు అభ్యంతరమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు అండగా బీజేపీ ఉంటుందన్నారు.

పేపర్ లీక్ లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ముమ్మాటికి సంబంధం ఉందన్నారు బీజేపీ నేత విజయశాంతి. రాష్ట్రంలో ఉంది BRS ప్రభుత్వం కాదా? బాధ్యత మీరు కాకపోతే ఎవరు తీసుకుంటారు? అంటూ నిలదీశారు విజయశాంతి.

ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో TSPSC దిద్దుబాటు చర్యలకు దిగింది. TSPSC ఆఫీసులోకి సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్‌లు నిషేధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నుంచి నిషేధం అమలవుతుందని అధికారులు తెలిపారు. అభ్యర్థుల ఫిర్యాదులు ఆన్ లైన్ ద్వారానే తీసుకోవాలని TSPSC నిర్ణయించింది.

సీఎం జగన్ ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించారు. వైఎస్సార్‌ ఆసరా పథకం మూడో విడత ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. 6 వేల 419కోట్ల ఆర్ధిక సాయాన్ని శనివారం నుంచి ఏప్రిల్‌ 5 వరకు స్వయం సహాయక పొదుపు సంఘాల సభ్యుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై మంత్రి కాకాణి గోవర్దన్‌ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారని నిర్ధారణకు వచ్చిన తర్వాతే పార్టీ చర్యలు తీసుకుందని చెప్పారు. ఎమ్మెల్యేలు, నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీ బలహీనపడదన్నారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రతో మోడీ, అమిత్ షాలు భయపడి ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాలపడుతున్నారని భట్టి మండిపడ్డారు.

విద్యుత్‌ వినియోగదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్‌ టారిఫ్‌ వివరాలను ఏపీఈఆర్సీ ఛైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డి ప్రకటించారు. ఈ ఏడాది విద్యుత్‌ వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని వెల్లడించారు.

TSPSC పేపర్ లీక్ మంటలు ఆరడం లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి ఆందోళనకు దిగారు విద్యార్థులు. TSPSC బోర్డును రద్దు చేసి చైర్మన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు.

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాల నివారణకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. నగరంలో పలు దుకాణాలు, ఆసుపత్రులు, వాణిజ్య సంస్థలు, గోడౌన్‌లలో తనిఖీలు నిర్వహించారు. ఫైర్ సేఫ్టీ లేకుండా అగ్ని ప్రమాదాలకు గురవ్వడానికి అవకాశమున్న కొన్ని వ్యాపార సంస్థలను గుర్తించి.. నోటీసులు జారీ చేశారు అధికారులు.

జగిత్యాలలో మున్సిపాలిటీ అధికారుల ఓవర్ యాక్షన్ వెలుగు చూసింది. ఇంటి పన్ను కట్టలేదని ఇళ్లకు తాళాలు వేసారు అధికారులు.

గుంటూరు జిల్లా తాడేపల్లి కుంచనపల్లి వద్ద మంత్రి జయరాం కాన్వాస్ అదుపు తప్పి ముందు వెళుతున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏఆర్ ఎస్సై కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలు అయ్యాయి. కాన్వాయ్ లో మంత్రి లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

బాపట్ల జిల్లా మార్టూరు మండలంలో భారీగా గంజాయి పట్టుబడింది. బొల్లపల్లి టోల్ ప్లాజా వద్ద లారీలో తరలిస్తున్న 180 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేశారు.

కర్ణాటక పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ బెంగళూరు మెట్రో రైలులో ప్రయాణించారు. అక్కడ వివిధ వర్గాల ప్రజలు, యువతతో మాట్లాడి వారి బాగోగులను తెలుసుకున్నారు.

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కేరళాలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణుల ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. =======

దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ఒక్క రోజులో లక్ష మందికిపైగా కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 15 వందల 90 కొత్త కేసులు బయటపడ్డాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News