BigTV English

TS Cabinet Meeting on DA: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఉద్యోగుల DA సహా కీలక అంశాలపై చర్చ!

TS Cabinet Meeting on DA: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఉద్యోగుల DA సహా కీలక అంశాలపై చర్చ!

Telangana Cabinet Meeting Today


Telangana Cabinet Meeting Today on DA: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. నేడో రేపో ఈసీ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనుందని ప్రచారం జరుగుతున్న వేళ.. తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలపై ప్రధాన చర్చ జరగనుందని తెలుస్తోంది.

స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకు వడ్డీలేని రుణాల పంపిణీ పునరుద్ధరణ, రూ.5 లక్షల జీవిత బీమా అమలు తదితర అంశాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించి నిర్ణలు తీసుకోనుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటనపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై కూడా చర్చించి.. కోదండరాం, ఆమెర్ అలీ ఖాన్ ల పేర్లనే గవర్నర్ కు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వంలో కొనసాగుతున్న 1100 మంది రిటైర్డ్ అధికారులను కొనసాగించాలా ? వద్దా ? అన్నదానిపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.


అధికారంలోకి వస్తే వంద రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ఈ నెల 17వ తేదీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు అవుతుంది. అయితే కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలలో ఇప్పటికే 4 గ్యారెంటీలు అమల్లో ఉన్నాయి. మంగళవారం జరిగే కేబినెట్‌ భేటీలో మరో కీలకమైన హామీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదే మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం. ఈ పథకం ఎన్నికల ముందు కచ్చితంగా ప్రభావం చూపుతుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. దాంతో పాటు నూతన తెల్లరేషన్‌ కార్డు దరఖాస్తుల పరిశీలనకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుందని తెలుస్తోంది.

Also Read: ఎంపీ అభ్యర్థులపై కేసీఆర్ కసరత్తు.. చేవెళ్ల బరిలో కాసాని జ్ఞానేశ్వర్..!

విద్యుత్ సంస్థల్లో కొత్త డైరెక్టర్ల నియామకం, రాష్టర సమాచార కమిషనర్ల నియామకం, అదనపు పోస్టులతో గ్రూప్-2, గ్రూప్-3 అనుబంధ నోటిఫికేషన్ల జారీ వంటివి కూడా మంత్రివర్గం పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తారు. లక్ష మంది మహిళలతో ఈ సభ జరగబోతుంది.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×