BigTV English

TS HC Notice to Padi Kaushik: ఓటేయకుంటే సూసైడే.. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై హైకోర్టు సీరియస్.. నోటీసులు జారీ!

TS HC Notice to Padi Kaushik: ఓటేయకుంటే సూసైడే.. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై హైకోర్టు సీరియస్.. నోటీసులు జారీ!

Telangana High Court Serves Notices to Padi Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఓటేయకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని కౌషిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈనెల 21న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. కౌషిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని బీజేపీ నేత ఈటల రాజేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


ఈటల పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. హుజూరాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసిన 24 మందికి నోటీసులు జారీ చేసింది. కౌషిక్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారా..? లేదా..? అని ఈనెల 20న హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించింది. వారిచ్చిన వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది హైకోర్టు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి సమీప బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై 16వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల ప్రచారంలోనే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో ప్రచారం నిర్వహిస్తూ తనని గెలిపించకపోతే తన కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటుందని ఎమోషనల్‌లో ఓట్లు అర్జించారు. దీంతో ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది.


Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు..

ఇక పాడి కౌశిక్ రెడ్డి వివాదాలకు కేరాఫ్ అని చెప్పొచ్చు. మాజీ గవర్నర్ తమిళి సై పై కౌశిక్ రెడ్డి చేసిన వాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి గవర్నర్ తిరస్కరించడంతో ఆమె పై అసభ్య పదజాలంతో కౌశిక్ రెడ్డి తీవ్ర వాఖ్యలు చేశారు. అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన ఎదురైనా తాను చేసిన వాఖ్యలకు కట్టుబడి ఉంటానన్న కౌశిక్ రెడ్డి.. చివరకు జాతీయ మహిళా కమీషన్ జోక్యంతో క్షమాపణలు చెప్పారు.

Tags

Related News

Formula-E Race Case: ఫార్ములా రేస్ కేసు.. గవర్నర్‌కు నివేదిక, అనుమతి తర్వాత కేటీఆర్‌ అరెస్ట్?

Telangana politics: క్లారిటీ ఇచ్చిన లోకేష్.. ఔను ఇద్దరం కలిశాం, కవిత టీడీపీలోకి వస్తే

Formula E race case: ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన పరిణామం.. ప్రభుత్వానికి ఏసీబీకి నివేదిక

Weather update: మళ్లీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వాన, జాగ్రత్త!

Warangal Incident: ‘నా భార్యతో ప్రాణహాని ఉంది’.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన భర్త

Heavy Rains: రాష్ట్రంలో ఒకవైపు సూర్యుడి భగభగలు.. మరోవైపు భారీ వర్షాలు

×