Big Stories

Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..!

Heavy Rains in Hyderabad: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాజధాని నగరంలో ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇక హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

- Advertisement -

నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్, బి.యన్ రెడ్డి నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఇక సికింద్రాబాద్, మారేడ్ పల్లి, బోయిన్ పల్లి, సీతఫల్ మండి, రాణిగంజ్, బేగంపేట్, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో రోడ్ల మీద వర్షపు నీరు వరదలా ప్రవహిస్తోంది.

- Advertisement -

బాల నగర్, బాచుపల్లి, మియాపూర్, కూకట్ పల్లి, చందానగర్, లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగర ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది.

Also Read: Telangana TET 2024 Results : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

నగరంలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. సిద్దిపేట జిల్లా తొగుట మండంలోని జప్తి లింగారెడ్డి పల్లిలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు రైతు కడారి శ్రీశైలం మృతి చెందాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News