Shamshabad Airport: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విషాద ఘటనలు జరిగాయి. రెండు మిస్టరీ డెత్స్ చోటుచేసుకున్నాయి. ఎవరికీ అంతుచిక్కని రీతిలో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. అప్పటి వరకూ అంతబాగానే ఉండగా.. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాక ఇద్దరు ప్రయాణికులు కుప్పకూలిపోయారు. ఆ తర్వాత హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఇద్దరు ప్రయాణికులు ఈ రోజు ఎయిర్‌పోర్టులో మరణించారు. గోవా నుంచి నితిన్ షా, జెడ్డా నుంచి షేక్ సకీనా బీలు ఈ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక వారు అస్వస్థతకు గురయ్యారు. ఎయిర్‌పోర్టులోనే వారు కుప్పకూలిపోయారు. అధికారులు వెంటనే అలర్ట్ అయి వారిని అపోలో ఆస్పత్రికి తరలించారు. అపోలో హాస్పిటల్‌లో వీరిద్దరూ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు.
వీరి మరణానికి గల కారణాలు ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ప్రయాణంలో వారు తిన్న ఆహారం ఫుడ్ పాయిజన్‌గా మారిందా? లేక ఫ్లైట్ ల్యాండ్ అవుతుండగా ఏర్పడే వైబ్రేషన్స్ లేదా ఇతర అసౌకర్యానికి గురై వారు మరణించారా? అనేది ఇంకా తెలియరాలేదు. అయితే, రేపటి వరకు ఈ రెండు మరణాలకు సంబంధించి పోస్టుమార్టం నివేదిక రానుంది. ఈ పోస్టుమార్టం రిపోర్టులోనే వీరిద్దరి మరణాలకు గల కారణాలు ఏమిటనేవి తెలియరానున్నాయి. అప్పటి వరకు ఈ మరణాలు మిస్టరీగానే ఉన్నాయి.