Minister Komati reddy: రేపు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకీ సమావేశాలకు రాకపోతే ప్రతిపక్ష నాయకుడిగా రాజీనామా చేయాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ ముగిసిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేపు అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ జరుగుతుందని చెప్పారు. రూ.లక్ష కోట్ల స్కాం గురించి మాట్లాడతామని మంత్రి పేర్కొన్నారు.
సభకు రాకపోతే ఆ తప్పు ఒప్పుకున్నట్టే..!
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ సభకు రాకపోతే తప్పు ఒప్పుకున్నట్టే అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరంపై గొప్పగా చెప్పిన కేసీఆర్.. ప్రాజెక్టుకు సంబంధించిన లోపాల గురించి కూడా వివరణ ఇవ్వాలని అన్నారు. రూ.లక్ష కోట్ల స్కామ్ పై అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుందని మంత్రి పేర్కొన్నారు.
ALSO READ: Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్‌లోనే పంచాయతీ ఎన్నికలు
కేసీఆర్ రాజీనామా చేయాలి..
కేంద్ర ప్రభుత్వమే యూరియా పంపిణీ ఆలస్యం చేస్తుందని అన్నారు. ‘యూరియా పంపిణీ గురించి కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం.. కాళేశ్వరంపై కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకపోతే ఆయనకు ఆ హోదా ఎందుకు..? ప్రతి సమావేశంలో కేటీఆర్, హరీష్ రావుతో మాట్లాడిస్తున్నారు. ఎప్పుడూ ఇదే జరుగుతుంది. అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా హరీష్ రావుకు ఇవ్వండి. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ రాజీనామా చేయాలి’ అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్‌కు ఎందుకంత భయం..: మంత్రి సీతక్క
కాళేశ్వరంపై చర్చ అంటే బీఆర్ఎస్ భయపడుతోందని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం.. బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పారు. కాళేశ్వరం రిపోర్టు అసెంబ్లీ పెట్టకుండా.. ఉండేందుకు బీఆర్ఎస్ శతవిధాల ప్రయత్నం చేస్తోందని అన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు అంటే బీఆర్ఎస్ కు ఎందుకంత భయమని మంత్రి ప్రశ్నించారు. యూరియా పేరుతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ: BRS MLAs Arrested: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి అరెస్ట్..