Student Denied Entry: యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్న ఒక షాకింగ్ ఘటన ప్రస్తుతం వార్తల్లో సంచలనంగా మారింది. కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో గణేష్ మాల ధరించిన విద్యార్థులను స్కూల్ యాజమాన్యం పనిష్మెంట్ ఇచ్చింది. తరగతి గదిలోకి అనుమతించకుండా, పిల్లలను బయట నిలబెట్టి, కాషాయ కండువాలతో లోనికి రానివ్వకుండా నిరాకరించింది.
యాదాద్రి భువనగిరి జిల్లా కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పలువురు విద్యార్థులు ఎప్పటిలాగే స్కూల్‌కు వెళ్లారు. గణేష్ మాల ధరించడంతో యాజమాన్యం వారిని అడ్డుకుంది. తరగతి లోనికి రావద్దని బయటనే విద్యార్థులను నిలబెట్టారు. తరగతిలోకి నిరాకరించడంతో పిల్లలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. విద్యార్థి హక్కులను దెబ్బతీసే చర్యగా భావిస్తున్నా విషయం, స్థానిక భక్తులు, తల్లిదండ్రులను తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also read:Bhimeshwara Temple: చెప్పులతో ఆలయ ప్రవేశం.. అన్యమతస్తులపై భక్తులు ఆగ్రహం.. ఎక్కడ అంటే?
విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించగా గణేష్ మాల ధరించారని అందుకే అనుమతించలేదని తెలిపారు. పిల్లలను అలా బయట నిబెట్టడం ఏంటని ప్రశ్నించారు? అయినా యాజమాన్యం వినకుండా లోనికి అనుమతించలేదు. దీంతో విశ్వహిందూ పరిషత్ నాయకులు కూడా హక్కుల ఉల్లంఘనగా, విద్యార్థుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక గుర్తింపును గౌరవించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఈ ఘటనకు పెద్ద సంఖ్యలో ప్రజలు, భక్తులు స్పందించారు. పాఠశాలల్లో విద్యార్థుల వ్యక్తిగత హక్కులను పరిరక్షించడం, వారు ధరిస్తున్న సంప్రదాయ, ఆధ్యాత్మిక గుర్తింపును గౌరవించడం అవసరమని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈఘటన విద్యార్థుల మానసిక స్థితి, వారి చదువుపై ప్రభావం, ఆధ్యాత్మిక స్వేచ్ఛకు ఇదొక హెచ్చరికగా మారింది.ఈఘటన సర్వత్రా చర్చకు దారితీస్తోంది.