Mokshagna : నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నట వారసుడి కోసం అభిమానులు దాదాపు ఐదు సంవత్సరాలు ఎదురు చూశారు. అయితే ఈ ఏడాది ఎదురుచూపుకు తెర దించుతూ… మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 6వ తేదీన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి మూవీని ప్రకటించారు. అంతేకాదు ఆ మూవీ నుంచి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయడం జరిగింది.
మూడో తరమే కాదు నాలుగో తరం హీరోలు కూడా ఎంట్రీ..
ఇదిలా ఉండగా.. నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం నటులు ఇప్పుడు చిత్ర పరిశ్రమలోకి క్యూ కడుతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR ), కళ్యాణ్ రామ్ (Kalyan Ram), తారకరత్న (Tarakaratna ), చైతన్య కృష్ణ (Chaitanya Krishna) హీరోలుగా పనిచేశారు. ప్రస్తుతం తారక్, కళ్యాణ్ రామ్ లు మాత్రమే స్టార్ స్టేటస్ తో కొనసాగుతున్నారు. మరొకవైపు నాలుగవ తరం నటులు కూడా ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. నందమూరి జానకీ రామ్ కొడుకు ఎన్టీఆర్ కూడా సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ప్రముఖ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ఆయనను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య కొడుకు మోక్షజ్ఞని కూడా హీరోగా పరిచయం చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.
రంగంలోకి దిగిన బాలయ్య చిన్న కూతురు..
హనుమాన్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ, ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం ఒక ఎత్తైతే, ఈ సినిమాకి బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా మారడం మరో ఎత్తు. సుధాకర్ చెరుకోరితో కలిసి ఆమె ఈ సినిమాని నిర్మిస్తోంది. అంతేకాదు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. మైథలాజికల్ అంశాలతో సినిమాని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ స్కూల్ నుంచి సోషియా ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాటు మైథాలజికల్ అంశాలను ముడిపెడుతూ పీరియాడికల్ ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మోక్షజ్ఞ మొదటి చిత్రం కోసం రూ.100 కోట్లు..
అంతేకాదు హనుమాన్ సినిమా ఎలిమెంట్స్ ని టచ్ చేస్తుందని , ఆ చిత్రానికి ఈ చిత్రానికి లింకు కూడా ఉంటుందని ప్రశాంత్ వర్మ వెల్లడించారు. ఇదిలా ఉండగా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఎవరైనా హీరో తొలి చిత్రం అంటే ఎంత భారీ స్థాయిలో ఉన్నా రూ .60 కోట్లకు మించి ఉండదు. కానీ మోక్షజ్ఞ మూవీకి సుమారుగా రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు వార్తలు రావడంతో రిస్కు చేస్తున్నారేమో అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఇదే నిజమైతే బాలయ్య ఆల్ టైం రికార్డు సృష్టించబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రశాంత్ వర్మ చాలా గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బాలయ్య నమ్మకాన్ని దర్శకుడు నిజం చేస్తారా..
దర్శకుడి పై నమ్మకంతోనే బాలకృష్ణ కూడా ఈ బడ్జెట్ పెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక ఏ విషయంలో కూడా రాజీపడకుండా బెస్ట్ ఉండేలా చూసుకుంటున్నట్లు సమాచారం. సాధారణంగా ఏ హీరో కైనా సరే తొలి చిత్రం చాలా కీలకమైనది .. ఎలాంటి కథతో వస్తున్నారు..? ఎలా చేశారు..? హిట్ అయ్యిందా ? లేదా ? అనే విషయాలు కచ్చితంగా చూస్తారు. ఆ తర్వాతే ఆ సినిమా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ ఉంటుంది. నెక్స్ట్ సినిమాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి బాలయ్య తన కొడుకు మొదటి సినిమా విషయంలో రాజీ పడడం లేదని సమాచారం. మరి నిర్మాతలు కూడా సపోర్టివ్ గానే ఉన్నారు. మరి అటు మోక్షజ్ఞ ఇటు ప్రశాంత్ వర్మ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.