Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు అవుతోన్న రిజర్వేషన్ల కోటా పరిమితిని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ లో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30 లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవో విడుదలకు కేబినెట్ ఆమోదించే అవకాశం కూడా ఉంది. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. పంటలు, రహదారులు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థిక శాఖ సాయం కోరుతూ తీర్మానం చేసే అవకాశం ఉంది. దీనిపై కూడా కేబినెట్ చర్చించనున్నట్టు సమాచారం.
ALSO READ: CM Chandrababu: ఎట్టకేలకు ఫలించిన చంద్రబాబు కృషి.. కుప్పంలో కృష్ణమ్మకు సీఎం జలహారతి
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్..!
తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీగా ఇద్దరు పేర్లను కేబినేట్ ఆమోదం తెలిపింది. కోదండరాం, అజారుద్దీన్ పేర్లను కేబినెట్ గవర్నర్ కు సిఫారసు చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అమీర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరు ప్రకటించింది.
ALSO READ: BRS MLAs Arrested: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి అరెస్ట్..